News February 21, 2025

మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్

image

AP: రాష్ట్రంలోని 164 మోడల్స్ స్కూళ్లలో ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 25 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించగా, ఏప్రిల్ 20వ తేదీన ఉదయం 10గంటల – మధ్యాహ్నం 12గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 5వ తరగతి స్థాయిలో ఉండే ఈ పరీక్షను తెలుగు/ఇంగ్లిష్ మీడియంలో రాయొచ్చు. అప్లికేషన్ వివరాలను పై ఫొటోలో, నోటిఫికేషన్ వివరాలను ఇక్కడ <>క్లిక్<<>> చేసి తెలుసుకోండి.

Similar News

News December 23, 2025

భారత్‌‌లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్

image

<<18623563>>హాదీ<<>> మరణం తర్వాత నెలకొన్న పరిణామాలతో భారత్-బంగ్లా సంబంధాలు క్షీణిస్తున్నాయి. తాజాగా భారతీయులకు కాన్సులర్, వీసా సర్వీసులను నిలిపేస్తున్నట్లు ఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్ తెలిపింది. అనివార్య పరిస్థితుల్లో తీసుకున్న ఈ నిర్ణయం తదుపరి నోటీసులు వచ్చే వరకు కొనసాగుతుందని చెప్పింది. హాదీ మృతి అనంతరం నెలకొన్న ఆందోళనలతో చటోగ్రామ్‌లోని వీసా అప్లికేషన్ సెంటర్‌ను భారత్ సండే క్లోజ్ చేసిన విషయం తెలిసిందే.

News December 23, 2025

30ఏళ్లు దాటితే బెల్లీ ఫ్యాట్.. కారణం తెలుసా?

image

30ఏళ్లు దాటిన తర్వాత మెటబాలిజంలో మార్పులొస్తాయి. ప్రతి పదేళ్లకు ఒకసారి శరీరంలో కండరాల సాంద్రత తగ్గుతుంది. దీంతో రెస్ట్ తీసుకునేటప్పుడు శరీరం ఖర్చు చేసే కేలరీల సంఖ్య తగ్గుతుంది. టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజెన్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ 4-5% పడిపోయి శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. డైట్, జీవనశైలిలో మార్పులు లేకున్నా బెల్లీ ఫ్యాట్ ఫార్మ్ అవుతున్నట్టు తాజా స్టడీలో వెల్లడైంది.

News December 23, 2025

సంక్రాంతి బరిలో ముందుకొచ్చిన మూవీ!

image

ఈ సంక్రాంతికి థియేటర్ల వద్ద సందడి చేయడానికి సినిమాలు క్యూ కట్టాయి. కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్, శ్రీలీల నటించిన ‘పరాశక్తి’ సైతం అదృష్టం పరీక్షించుకోనుంది. అయితే రిలీజ్ డేట్‌పై మేకర్స్ ట్విస్ట్ ఇచ్చారు. తొలుత JAN 14 అని చెప్పి తాజాగా JAN 10నే వస్తున్నట్లు ప్రకటించారు. రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి తదితర తెలుగు చిత్రాల మధ్య ఈ మూవీకి థియేటర్లు దొరుకుతాయో లేదో చూడాలి.