News December 26, 2024

సైనిక్ స్కూళ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్

image

2025-26కు గాను దేశవ్యాప్తంగా సైనిక్ స్కూళ్లలో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు ఎన్టీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. JAN 13న సా.5 వరకు https://exams.nta.ac.in/AISSEE/లో దరఖాస్తు చేసుకోవచ్చు. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో ఆఫ్‌లైన్ విధానంలో పరీక్ష ఉంటుంది. ఆరో క్లాస్‌కు అభ్యర్థుల వయసు మార్చి 31, 2025 నాటికి 10-12 ఏళ్లు, 9వ క్లాస్‌కు 13-15 ఏళ్లు ఉండాలి. పరీక్ష విధానం, సిలబస్ కోసం <>ఇక్కడ క్లిక్<<>> చేయండి.

Similar News

News November 3, 2025

రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు

image

AP: కల్తీ మద్యం కేసులో అరెస్టైన మాజీ మంత్రి జోగి రమేశ్, ప్రధాన నిందితుడు జనార్దన్ రావు మధ్య సంబంధాలు ఉన్నాయని సిట్ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. మొదట ములకలచెరువులో మద్యం తయారీ ప్రారంభించాలని రమేశ్ మంత్రిగా ఉన్నప్పుడే జనార్దన్ రావుకు సూచించారని తెలిపారు. కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు తొలుత ములకలచెరువు, ఆ తర్వాత ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యంపై హడావుడి చేశారని వివరించారు.

News November 3, 2025

పాపికొండల బోటింగ్ షురూ

image

AP: పాపికొండల బోటింగ్ మళ్లీ మొదలైంది. పోలవరం ప్రాజెక్టు సమీపంలోని గండిపోచమ్మ వద్ద నిన్న రెండు బోట్లలో 103 మంది పర్యాటకులు బోటులో షికారుకెళ్లారు. వాస్తవానికి దీపావళికి ముందే ఈ బోటింగ్ ప్రారంభమైనప్పటికీ భారీ వర్షాలు, వరదలతో నిలిచిపోయింది. తాజాగా సాధారణ వాతావరణం ఉండటంతో అధికారులు అనుమతిచ్చారు. కార్తీక మాసం కావడంతో తిరిగి పర్యాటకుల తాకిడి పెరగనుంది.

News November 3, 2025

ఈ వరి రకం.. ముంపు ప్రాంత రైతులకు వరం

image

MTU 1232.. ఇది 15 నుంచి 20 రోజుల పాటు వరద ముంపును తట్టుకొని అధిక దిగుబడినిచ్చే వరి రకం. పంటకాలం 140 రోజులు. పైరు తక్కువ ఎత్తు పెరిగి, గింజ సన్నగా ఉంటుంది. బియ్యం శాతం అధికం. దోమ పోటు, అగ్గి తెగులు, మాగుడు తెగులును తట్టుకుంటుంది. ఇది పడిపోదు, గింజ రాలదు. ఎకరాకు సాధారణ భూమిలో 40 బస్తాలు, ముంపు ప్రాంతాల్లో 30-35 బస్తాల దిగుబడినిస్తుంది. ✍️ రోజూ ఇలాంటి సమాచారానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.