News February 23, 2025
CISFలో 1161 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 1161 కానిస్టేబుల్/ట్రేడ్స్‌మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పురుషులకు 945, మహిళలకు 103, ఎక్స్‌సర్వీస్‌మెన్-113 ఖాళీలున్నాయి. టెన్త్/ సంబంధిత ట్రేడ్ ఉన్న 18 నుంచి 23 ఏళ్లలోపు వారు అర్హులు. మార్చి 5 నుంచి APR 3 మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి రూ.21,700-69,100 జీతం చెల్లిస్తారు. మరిన్ని వివరాలకు <
Similar News
News February 23, 2025
INDvsPAK మ్యాచ్ చూస్తున్న మంత్రి లోకేశ్, చిరు

ఏపీ మంత్రి నారా లోకేశ్, చిరంజీవి, ఎంపీ కేశినేని చిన్ని, ఫిల్మ్ డైరెక్టర్ సుకుమార్ తదితరులు దుబాయ్ వెళ్లారు. ఇండియా, పాకిస్థాన్ మ్యాచును వీక్షిస్తున్నారు. లోకేశ్, కేశినేని చిన్ని, సుకుమార్ కుటుంబ సభ్యులు టీమ్ ఇండియా జెర్సీని ధరించి స్టేడియానికి వచ్చారు.
News February 23, 2025
నిలకడగా ఆడుతున్న పాక్.. షకీల్ ఫిఫ్టీ

భారత్‌తో జరుగుతున్న మ్యాచులో పాకిస్థాన్ నిలకడగా ఆడుతోంది. 10 ఓవర్లలోపే రెండు వికెట్లను కోల్పోగా ఆ తర్వాత వచ్చిన షకీల్(50*), రిజ్వాన్(41*) ఆచితూచి ఆడుతున్నారు. దీంతో ఆ జట్టు 31 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. భారత బౌలర్లు వికెట్ల కోసం శ్రమిస్తున్నారు.
News February 23, 2025
మిర్చి రైతులను ఉద్ధరించినట్లు కూటమి గప్పాలు: షర్మిల

AP: మిర్చి రైతులకు రూ.11 వేల మద్దతు ధర ఇచ్చి ఏదో ఉద్ధరించినట్లు కూటమి ప్రభుత్వం గప్పాలు కొడుతోందని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల విమర్శించారు. రైతులపై ప్రభుత్వానికి ప్రేమ ఉంటే రూ.26వేల కనీస ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. అండగా నిలవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం రైతుల కళ్లలో కారం కొడుతుందని దుయ్యబట్టారు. టమాటా రైతులనూ ఆదుకోవాలన్నారు. ధరలు పడిపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు.