News January 4, 2025

1673 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

image

తెలంగాణ హైకోర్టు పరిధిలోని 1673 టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లా కోర్టుల్లో జూనియర్, ఫీల్డ్, రికార్డ్ అసిస్టెంట్ వంటి పోస్టులు 1277, స్టెనోగ్రాఫర్, టైపిస్ట్ వంటి టెక్నికల్ పోస్టులు 184, హైకోర్టులో మరో 212 ఉద్యోగాలున్నాయి. JAN 8 నుంచి 31లోగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు, ఏ జిల్లాల్లో ఎన్ని ఉద్యోగాలున్నాయనే వివరాల కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

Similar News

News December 9, 2025

మహాలక్ష్మి పథకంతో మహిళలకు రూ.8,459 కోట్లు ఆదా: పొన్నం

image

TG: మహాలక్ష్మి పథకం ద్వారా RTCలో మహిళలకు ఉచిత ప్రయాణాలు మొదలై రెండేళ్లు పూర్తయ్యాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. రెండేళ్లలో మహిళలు 251 కోట్ల జీరో టికెట్ల ద్వారా రూ.8,459 కోట్లు ఆదా చేసినట్లు వెల్లడించారు. బస్సుల్లో ఉచిత ప్రయాణమే కాకుండా మహిళలను బస్సులకు యజమానులుగా చేసిన ప్రభుత్వంగా నిలిచిందని పేర్కొన్నారు.

News December 9, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.330 తగ్గి రూ.1,30,090కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.300 పతనమై రూ.1,19,250 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.1,000 పెరిగి రూ.1,99,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News December 9, 2025

NIT వరంగల్‌లో 45పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు

image

<>NIT<<>> వరంగల్ 45 ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తు గడవును పొడిగించింది. అప్లైకి DEC 12 ఆఖరు తేదీ కాగా.. DEC 31వరకు పొడిగించారు. పోస్టును బట్టి PhD, ME, ఎంటెక్, MSc, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.2000, SC, ST, PwDలకు రూ.1000. వెబ్‌సైట్: https://nitw.ac.in/faculty