News December 29, 2024
త్వరలో 32వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

రైల్వే శాఖ దేశవ్యాప్తంగా 32,438 గ్రూప్-డి పోస్టుల భర్తీకి వచ్చే నెలలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. పాయింట్స్మెన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెనర్ వంటి పోస్టులు భర్తీ చేయనుంది. జనవరి 23 నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుందని సమాచారం. పదోతరగతి, ఐటీఐ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. బేసిక్ సాలరీ రూ.18వేలు.
Similar News
News October 22, 2025
డిజిటల్ ఇండియా కార్పొరేషన్లో ఉద్యోగాలు

డిజిటల్ ఇండియా కార్పొరేషన్ 16 పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి బీఈ, బీటెక్, ఎంబీఏ, డిగ్రీ, పీజీ( కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఐటీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 10 పోస్టులకు అప్లైకి ఈ నెల 24 ఆఖరు తేదీ కాగా.. 6 పోస్టులకు ఈ నెల 28 లాస్ట్ డేట్. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://dic.gov.in/
News October 22, 2025
ఇతిహాసాలు క్విజ్ – 43

1. జనకుని తమ్ముడి పేరు ఏంటి?
2. కుంతీ కుమారుల్లో పెద్దవాడు ఎవరు?
3. ఊర్ధ్వ లోకాలలో మొదటి లోకం ఏది?
4. విష్ణువు చేతిలో ఉండే చక్రం పేరు ఏమిటి?
5. దేవాలయాల్లో విగ్రహాలను ప్రతిష్ఠించేటప్పుడు వాటికి జీవం పోసే ఆచారం/వేడుకను ఏమంటారు?
– సరైన సమాధానాలు సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>
News October 22, 2025
సౌదీలో ‘కఫాలా’ రద్దు.. ఏంటో తెలుసా?

సౌదీ అరేబియాలో 1950ల నుంచి ‘కఫాలా’ సిస్టమ్ అమల్లో ఉంది. పాస్పోర్టును యజమానికి సమర్పించడం, ఇంటికి వెళ్లాలన్నా, జాబ్ మారాలన్నా కచ్చితంగా పర్మిషన్ తీసుకోవడం, న్యాయ సహాయం లేకపోవడం ఇలా ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఒకరకంగా చెప్పాలంటే విదేశీ కార్మికులను బానిసలుగా చూసేవాళ్లు. సంస్కరణల్లో భాగంగా సౌదీ యువరాజు ఇటీవల ఈ విధానాన్ని రద్దు చేశారు. దీంతో 1.3 కోట్ల మంది విదేశీ కార్మికులకు ఊరట కలగనుంది.