News January 1, 2025
త్వరలో 866 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
AP: జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 12న 866 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు, పాత నోటిఫికేషన్ల రాత పరీక్ష వివరాలను APPSC ప్రకటించే అవకాశం ఉంది. ఒక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోనే 800కు పైగా పోస్టులున్నట్లు తెలుస్తోంది. అత్యధికంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు 650కి పైగా ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం.
Similar News
News January 4, 2025
BREAKING: తగ్గిన బంగారం ధర
గత రెండ్రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఇవాళ తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.490 తగ్గి రూ.78,710 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.450 తగ్గి రూ.72,150గా ఉంది. అటు వెండి ధర కేజీపై రూ.1000 తగ్గి రూ.99,000 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
News January 4, 2025
రోహిత్.. హ్యాట్సాఫ్: మంజ్రేకర్
రోహిత్ శర్మ తాను ఫామ్లో లేనని ఒప్పుకోవడాన్ని కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ కొనియాడారు. ‘హ్యాట్సాఫ్ రోహిత్. మరీ ఎక్కువమంది ఫామ్ లేని ఆటగాళ్లు సిడ్నీ టెస్టులో ఆడటం మంచిది కాదని తాను తప్పుకున్నానన్నారు. ఇంటర్వ్యూలో అత్యంత నిజాయితీతో మాట్లాడారు’ అని ట్వీట్ చేశారు. కాగా.. తనకు రిటైర్మెంట్ ఆలోచన లేదని, ఈ మ్యాచ్కు మాత్రం తానే తప్పుకొన్నానని రోహిత్ ఇంటర్వ్యూలో తెలిపిన సంగతి తెలిసిందే.
News January 4, 2025
చంద్రబాబు గారూ ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా?: జగన్
AP: వరుసగా క్యాబినెట్ భేటీలు జరుగుతున్నా ‘తల్లికి వందనం’ ఎప్పుడు అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పట్లేదని ప్రభుత్వాన్ని YS జగన్ విమర్శించారు. అధికారంలోకి వచ్చాక ఎందరు పిల్లలుంటే అంతమందికీ ఏడాదికి రూ.15వేలు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ‘ఈ ఏడాదికి తల్లికి వందనం ఇవ్వబోమని తేల్చిచెప్పేశారు. చంద్రబాబు గారూ ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా?’ అని ట్వీట్ చేశారు. రైతు భరోసా ఎప్పుడిస్తారని ప్రశ్నించారు.