News August 10, 2024

MBBS ప్రవేశాలకు నోటిఫికేషన్

image

AP: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల్లో MBBS, BDS కోర్సుల్లో కన్వీనర్ కోటా ప్రవేశాలకు హెల్త్ వర్సిటీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇవాళ మ.2 గంటల నుంచి 16వ తేదీ సా.6 వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 35 మెడికల్ కాలేజీల్లో 6,210 సీట్లు ఉండగా, కన్వీనర్ కోటాలో 3,856 సీట్లు, 18 డెంటల్ కాలేజీల్లో 1,540 సీట్లను భర్తీ చేస్తారు.
వెబ్‌సైట్: <>https://apuhs-ugadmissions.aptonline.in/<<>>

Similar News

News September 17, 2025

EVMలపై అభ్యర్థుల కలర్ ఫొటోలు: EC

image

ఈవీఎంలపై భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ సమయంలో మెషీన్లపై గుర్తులతో పాటు అభ్యర్థుల కలర్ ఫొటోలు ఉంచనున్నట్లు తెలిపింది. బిహార్ ఎన్నికల నుంచి ఈ నిబంధనలు అమలు చేయనున్నట్లు పేర్కొంది. దీంతో ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థులను మరింత సులభంగా ఎన్నుకోవచ్చు. ఈవీఎం ప్యానెల్‌లో క్రమసంఖ్య, అభ్యర్థి పేరు, కలర్ ఫొటో, గుర్తు వరుసగా ఉంటాయి. ఇప్పటివరకు అభ్యర్థుల పేర్లు, పక్కన వారి సింబల్స్ ఉండేవి.

News September 17, 2025

ఆర్టీసీలో 1,743 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. TGSRTCలో 1,743 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 1,000 డ్రైవర్, 743 శ్రామిక్(మెకానిక్, ఫిట్టర్, షీట్ మెటల్, ఆటో ఎలక్ట్రిషియన్, పెయింటర్, వెల్డర్, అప్ హోల్స్టర్, మిల్‌రైట్ మెకానిక్) పోస్టులకు అక్టోబర్ 8 నుంచి 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సంస్థ ప్రకటించింది. మరిన్ని వివరాలకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News September 17, 2025

1-12 తరగతుల వరకు మార్పులు: CM

image

TG: విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకురావడమే తన ధ్యేయమని CM రేవంత్ అన్నారు. నూతన విద్యా విధానం రూపకల్పనపై అధికారులతో సమీక్షించారు. ‘పేదరిక నిర్మూలనకు విద్య ఒక్కటే మార్గం. 1-12 తరగతుల వరకు మార్పులు జరగాలి. ఎలాంటి నిర్ణయానికైనా నేను సిద్ధం. ఇంజినీరింగ్ విద్యార్థులు ఉద్యోగాలు పొందలేకపోవడానికి నాణ్యత, నైపుణ్యత కొరవడటమే కారణం. మేధావులు, విద్యాధికుల సూచనలతో కొత్త పాలసీ రూపొందించాలి’ అని ఆదేశించారు.