News February 5, 2025
పంచాయతీ ఎన్నికలకు వారంలో నోటిఫికేషన్?

తెలంగాణ పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలుకానుంది. కులగణన, జనాభా ఆధారంగా వారికి రిజర్వేషన్లు కల్పించే అంశంపై ప్రభుత్వం స్పష్టతకు రావడంతో మరో వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్లపై కేంద్రం స్పందించకపోయినా, పార్టీ పరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని సీఎం రేవంత్ చెప్పారు. దీంతో ఎన్నికల నిర్వహణకు ఎక్కువ టైం పట్టదంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
Similar News
News March 24, 2026
ఆరెంజ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు

రాబోయే 2-3 గంటల్లో మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ADB, HYD, BHPL, KNR, ASF, MBNR, యాదాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. కాగా ఇప్పటికే HYDలో వర్షం కొనసాగుతోంది. అటు ఏపీలో రేపు అల్లూరి, పోలవరం జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో వర్షాలు కురిసే అవకాశముందని APSDMA పేర్కొంది.
News March 24, 2026
డీలిమిటేషన్‌పై పోరాటానికి సిద్ధం కావాలి: రేవంత్

TG: దక్షిణాది రాష్ట్రాల అవసరం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలని BJP అనుకుంటోందని CM రేవంత్ ఆరోపించారు. డీలిమిటేషన్‌పై TV9 సమ్మిట్‌లో మాట్లాడుతూ ‘ఏ లెక్క ప్రకారం 50% సీట్ల పెంపు ఉంటుంది. జనాభా ఆధారంగా సీట్లు పెంచితే దక్షిణాదికే నష్టం. సీట్ల పెంపుపై చర్చ జరగాలి. 50% పెంపులోనే కుట్ర ఉంది. డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాలు పోరాటానికి సిద్ధం కావాలి’ అని పిలుపునిచ్చారు.
News March 24, 2026
IPL నుంచి తప్పుకున్న ENG బ్యాటర్!

IPL-2026 నుంచి ENG బ్యాటర్ బెన్ డకెట్(DC) తప్పుకున్నట్లు CricBuzz వెల్లడించింది. ఇంటర్నేషనల్ కెరీర్‌పై ఫోకస్ చేసేందుకు ఆయన IPLను స్కిప్ చేస్తున్నట్లు సమాచారం. BCCI రూల్ ప్రకారం ఆయనపై రెండేళ్ల నిషేధం పడే అవకాశం ఉంది. ఆక్షన్‌లో ఎంపికైన తర్వాత టోర్నీ నుంచి తప్పుకునే ప్లేయర్లను బ్యాన్ చేయాలని గతేడాది కొత్త రూల్‌ను తీసుకొచ్చారు. అటు CSKలోకి నాథన్ ఎల్లిస్ స్థానంలో AUS పేసర్ స్పెన్సర్ జాన్సన్ రానున్నారు.


