News April 16, 2025

రాష్ట్రంలో రాజ్యసభ స్థానానికి నోటిఫికేషన్

image

AP: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాన్ని భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మే 9న రాజ్యసభ స్థానానికి ఎన్నిక నిర్వహిస్తామని తెలిపింది. ఈ నెల 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు వెల్లడించింది. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 2028 జూన్ వరకు పదవీకాలం ఉండగానే ఆయన రాజీనామా చేశారు.

Similar News

News April 16, 2025

IPL జట్లకు BCCI అలర్ట్!

image

HYDకు చెందిన ఓ వ్యాపారవేత్త IPL జట్ల ఓనర్లు, ప్లేయర్లు, కోచ్‌లను ట్రాప్ చేసేందుకు యత్నిస్తున్నట్లు BCCI గుర్తించిందని Cricbuzz పేర్కొంది. వారిని ఫిక్సింగ్ వంటి కార్యకలాపాల్లో భాగం చేయాలని అతడు చూస్తున్నాడని, జట్లన్నీ అప్రమత్తంగా ఉండాలని BCCI జట్లకు సూచించినట్లు తెలిపింది. సదరు వ్యక్తికి బుకీలతో సంబంధాలున్నాయని, అతడు ఎవరినైనా సంప్రదిస్తే తమకు రిపోర్ట్ చేయాలని జట్లను బోర్డు ఆదేశించినట్లు సమాచారం.

News April 16, 2025

సుప్రీంకోర్టు తదుపరి CJIగా గవాయ్

image

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌గా బీఆర్ గవాయ్ నియమితులయ్యారు. ప్రస్తుత సీజేఐ సంజీవ్ ఖన్నా మే 13న రిటైర్ కానుండటంతో కొలీజియం గవాయ్ పేరును సిఫార్సు చేసింది. దీంతో దేశ అత్యున్నత న్యాయస్థానం 52వ సీజేఐగా గవాయ్ మరో నెలలో బాధ్యతలు చేపట్టనున్నారు.

News April 16, 2025

ట్రంప్‌కు యాక్టింగ్ ఛాన్స్ ఇచ్చి తప్పు చేశా: డైరెక్టర్

image

ట్రంప్ నిర్ణయాలపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నవేళ హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్ కొలంబస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన చిత్రం హోమ్ ఎలోన్-2లో ట్రంప్‌కు కెమియో రోల్ ఇచ్చి తప్పుచేశానని అన్నారు. ట్రంప్ సీన్ కట్ చేయాలని ఉన్నా చేయలేనని, చేస్తే తనను దేశ బహిష్కరణ చేస్తారని అప్పుడు వేరే దేశంలో ఉండాలని అన్నారు. కాగా గతంలో తనను హోమ్ ఎలోన్-2లో నటించమని డైరెక్టర్ బతిమాలాడని ట్రంప్ అన్నారు.

error: Content is protected !!