News September 30, 2024

గ్రాడ్యుయేట్ MLC ఓట్ల నమోదుకు నోటిఫికేషన్

image

AP: ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల (గ్రాడ్యుయేట్) పట్టభద్రుల స్థానం పరిధిలో ఓటర్ల నమోదుకు నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 6 వరకు పట్టభద్రులు ఫారం 18 ద్వారా ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌లో ఓట్ల నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 23న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల కానుండగా, డిసెంబర్ 9 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. డిసెంబర్ 30న MLC ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు.

Similar News

News September 30, 2024

CBN హిందువులకు క్షమాపణ చెప్పాలంటూ ట్రెండింగ్

image

తిరుమల లడ్డూ విషయంలో సుప్రీం కోర్టు AP CM చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. విచారణ పూర్తవ్వకముందే ప్రకటన చేయాల్సిన అవసరం ఏముందంటూ ధర్మాసనం ప్రశ్నించిన నేపథ్యంలో ‘CBN Should Apologize Hindus’ అన్న హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. వైసీపీ ఈ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తోందని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తుండగా, హిందువులందరూ CBNని క్షమాపణ అడుగుతున్నారంటూ వైసీపీ కార్యకర్తలు తేల్చిచెబుతున్నారు.

News September 30, 2024

లాక్‌డౌన్ వల్ల చంద్రుడిపై ఉష్ణోగ్రత తగ్గుదల!

image

కొవిడ్ లాక్‌డౌన్ కారణంగా చంద్రుడిపై ఉష్ణోగ్రతలు తగ్గాయని భారత పరిశోధకుల అధ్యయనంలో తేలింది. వారి నివేదిక ప్రకారం.. 2017-23 మధ్యకాలంలో చంద్రుడిపై 6 వివిధ ప్రాంతాల్లోని ఉష్ణోగ్రతల్ని నాసా ఆర్బిటర్ డేటా సాయంతో స్టడీ చేశారు. ఈక్రమంలో లాక్‌డౌన్ కాలంలో చందమామపై టెంపరేచర్ గణనీయంగా తగ్గిందని గుర్తించారు. కాలుష్యం తగ్గడంతో భూమి నుంచి వెలువడే రేడియేషన్ కూడా తగ్గడమే దీనికి కారణం కావొచ్చని వారు అంచనా వేశారు.

News September 30, 2024

పాతబస్తీకి హైడ్రా వస్తే తీవ్ర పరిణామాలు: MIM ఎమ్మెల్యేలు

image

TG: హైడ్రాకు ఎంఐఎం ఎమ్మెల్యేలు హెచ్చరికలు జారీ చేశారు. పాతబస్తీలో సర్వేకు వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అన్నారు. ఇప్పటివరకు తమ ఇలాఖాలోకి వచ్చే ధైర్యం ఎవరూ చేయలేదని చెప్పారు. బుల్డోజర్లు వస్తే తమ పైనుంచే వెళ్లాలని అల్టిమేటం జారీ చేశారు.