News April 17, 2025
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ పోస్టులకు నోటిఫికేషన్

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 309 పోస్టులకు గానూ ఏప్రిల్ 25న అప్లికేషన్ ప్రక్రియ మొదలవుతుంది. మే 24వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధింత విభాగంలో బీఎస్సీ, బీటెక్ లేదా బీఈలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం ఇక్కడ <
Similar News
News April 19, 2025
ఈ నెల 23న ‘పది’ ఫలితాలు?

AP: ఈ నెల 23న పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పేపర్ల వ్యాల్యుయేషన్ కూడా పూర్తయ్యింది. విద్యార్థులకు వచ్చిన మార్కులను ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ ఏడాది టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్స్‌కు 6,19,275 మంది హాజరయ్యారు. వీరిలో 5,64,064 మంది ఇంగ్లిష్ మీడియం, 51,069 మంది విద్యార్థులు తెలుగు మీడియంలో పరీక్షలు రాశారు. Way2Newsలోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
News April 19, 2025
తిరుమల: దర్శనానికి 24 గంటలు

AP: తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండి టీబీసీ క్యూలైన్ వరకు వేచి ఉన్నారు. నిన్న 58,519 మంది స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీకి రూ.3.27 కోట్ల ఆదాయం సమకూరింది.
News April 19, 2025
తెలుగు రాష్ట్రాల్లో నేడు

☛ బెంగాల్‌లో హిందువులపై హింసకు వ్యతిరేకంగా TGలో VHP, బజరంగ్ దళ్ ఆందోళనలు
☛ గ్రేటర్ HYD బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ సమావేశం.. వరంగల్ సభపై దిశానిర్దేశం
☛ AP: మద్యం కేసులో సిట్ విచారణకు MP మిథున్ రెడ్డి
☛ ఉ.10 గంటలకు జులై నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
☛ AP: విశాఖ మేయర్ హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం