News October 9, 2025

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నేడే నోటిఫికేషన్

image

TG: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ ఇవాళ విడుదల కానుంది. మొదటి విడతలో 2,963 ఎంపీటీసీ, 292 జడ్పీటీసీ స్థానాలకు ఎలక్షన్స్ జరగనున్నాయి. నేటి నుంచి 11వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. రోజూ ఉ.10.30 నుంచి సా.5 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 23న పోలింగ్ జరగనుండగా, నవంబర్ 11న ఫలితాలు వెలువడనున్నాయి. ఈనెల 13న రెండో విడత ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ కానుంది.

Similar News

News October 9, 2025

20 మంది పిల్లలు మృతి.. సర్కార్ నిర్లక్ష్యమే కారణమా?

image

కోల్డ్రిఫ్ కాఫ్ సిరప్ వల్ల మధ్యప్రదేశ్‌లో 20 మంది పిల్లలు మరణించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 19నే మరణాలు నమోదైనా సర్కార్ నిర్లక్ష్యం వహించింది. 29న సిరప్ శాంపిళ్లను రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ఛింద్వాడా నుంచి భోపాల్ (300 కి.మీ)కు పంపారు. గంటల్లో వెళ్లాల్సిన శాంపిల్స్ 3 రోజులకు అక్కడికి చేరాయి. రిపోర్ట్ రాకముందే అక్టోబర్ 1, 3 తేదీల్లో ఆ సిరప్ సేఫ్ అని ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటించడం గమనార్హం.

News October 9, 2025

98 ఇంజినీర్ పోస్టులు.. దరఖాస్తు చేశారా?

image

IOCL అనుబంధ సంస్థ నుమాలీగఢ్ రిఫైనరీ లిమిటెడ్‌లో 98 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ(OCT 10). ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులకు ఇంజినీరింగ్‌లో కనీసం 65% మార్కులతో పాసై ఉండాలి. అసిస్టెంట్ ఆఫీసర్ ట్రైనీ పోస్టులకు PG, నెట్/గేట్ అర్హత సాధించాలి.
* ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News October 9, 2025

IGMCRI 226 పోస్టులకు నోటిఫికేషన్

image

ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ& రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ 226 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు NOV 6వరకు అప్లై చేసుకోవచ్చు. నర్సింగ్ డిగ్రీ, డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్, మిడ్ వైఫరీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయసు 18 -35ఏళ్ల మధ్య ఉండాలి. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.250, SC, STలకు రూ.125. వెబ్‌సైట్: https://igmcri.edu.in/