News September 30, 2024

నూతన లిక్కర్ పాలసీపై నేడో రేపో నోటిఫికేషన్

image

AP: మద్యం వ్యాపారాన్ని ప్రైవేటుకు అప్పగించేందుకు వీలుగా ‘AP రెగ్యులరేషన్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్’ చట్టానికి ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ ఆర్డినెన్స్‌ను గవర్నర్ జస్టిస్ నజీర్ ఆమోదించారు. న్యాయశాఖ ఇవాళ ఉదయం గెజిట్ నోటిఫికేషన్ ప్రచురించనుంది. నూతన మద్యం పాలసీ విధివిధానాలతో నేడు సాయంత్రం లేదా రేపు ఉదయం ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులివ్వనుంది. OCT 10-11 నాటికి లైసెన్సుల ప్రక్రియ పూర్తవనుంది.

Similar News

News September 30, 2024

కాంగ్రెస్ ఎంపీ అనిల్‌కు లీగల్ నోటీసు పంపుతున్నా: హరీశ్‌రావు

image

TG: హిమాయత్ సాగర్ FTL భూముల్లో అక్రమంగా నిర్మించిన ఆనంద కన్వెన్షన్‌లో వాటా ఉందని తనపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్‌పై హరీశ్ రావు మండిపడ్డారు. ‘ప్రజా సమస్యలపై పోరాడుతున్న నాపై బురద చల్లే వికృత రాజకీయాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపింది. అబద్ధపు ప్రచారం చేస్తున్న అనిల్‌కు లీగల్ నోటీసు పంపుతున్నా. క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా ఎదుర్కోవాలని హెచ్చరిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.

News September 30, 2024

మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

image

బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తిని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. OCT 8న జరిగే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ విషయాన్ని Xలో వెల్లడించారు. 1950లో కోల్‌కతాలో జన్మించిన మిథున్.. 1976లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1989లో ఏకంగా 19 సినిమాలు రిలీజ్ చేసి రికార్డు సృష్టించారు.

News September 30, 2024

Stock Market: నష్టాల్లో నడుస్తున్నాయ్

image

అధిక వెయిటేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, TCS, ICICI గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అవ్వ‌డంతో సెన్సెక్స్, నిఫ్టీ న‌ష్టాల్లో న‌డుస్తున్నాయి. సెన్సెక్స్ ప్ర‌స్తుతం 500 పాయింట్ల న‌ష్ట‌ంతో 85,060 వ‌ద్ద‌, నిఫ్టీ 150 పాయింట్ల న‌ష్టంతో 26,030 వ‌ద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇటీవ‌ల చైనా Central Bank వ‌డ్డీ రేట్ల కోత‌తో FIIల మనీ ఫ్లో ఆ దేశ మార్కెట్లలో అధికంగా ఉండడం కూడా మన మార్కెట్ల నష్టాలకు కారణంగా తెలుస్తోంది.