News July 16, 2024

‘నవోదయ’లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

image

2025-26 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. మొత్తం దేశంలో 653 నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి సీట్ల భర్తీకి రెండు విడతల్లో ఎంపిక పరీక్ష(JNVST2024) ఉంటుంది. ఒక విడతలో పర్వత ప్రాంతాల్లో, మరో విడతలో మిగిలిన ప్రాంతాల్లో పరీక్ష నిర్వహిస్తారు.

Similar News

News October 15, 2025

పాక్-అఫ్గాన్ మధ్య మళ్లీ ఘర్షణలు!

image

పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ దేశాల మధ్య ఇటీవల ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. ముస్లిం దేశాల జోక్యంతో అఫ్గాన్ కాల్పులను తాత్కాలికంగా విరమించుకుంది. అయితే మళ్లీ తాలిబన్ సైన్యం, పాక్ ఆర్మీ మధ్య ఘర్షణలు ప్రారంభమైనట్లు సమాచారం. ప్రత్యర్థులు కుట్ర పన్నుతున్నారన్న ముందస్తు సమాచారంతో అఫ్గాన్ సైన్యం సరిహద్దులోని పాక్ పోస్టులను లక్ష్యంగా చేసుకుని దాడికి దిగినట్లు తెలుస్తోంది.

News October 15, 2025

2800 MW విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతి

image

AP: రాష్ట్రంలో 2800 MW విద్యుదుత్పత్తి ప్లాంట్లకు అనుమతిస్తూ ప్రభుత్వం GOలు జారీచేసింది. మన్యం(D) మక్కువ(M) దుగ్గేరులో 2000MW హైడ్రో ప్రాజెక్టు కోసం ‘చింతా గ్రీన్ ఎనర్జీ’కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనంతపురం(D) కమలపాడు, కొనకొండ్ల, గుల్లపాలెంలో ‘ACME ఊర్జా’, బెళుగుప్ప(M)లోని 4 గ్రామాల్లో ‘TATA’ 400MW చొప్పున సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఓకే చెప్పింది. వీటికి భూమి ఇతర రాయితీలను GOల్లో పొందుపర్చారు.

News October 14, 2025

ఉమెన్స్ వరల్డ్ కప్: భారత్ సెమీస్ వెళ్లాలంటే?

image

SA, AUS చేతిలో ఓడిపోయిన టీమ్ఇండియా సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. నెక్ట్స్ ఈనెల 19న ENG, 23న NZ, 26న బంగ్లాతో తలపడనుంది. బంగ్లా మినహా ENG, NZపై భారత రికార్డు పేలవంగా ఉంది. కానీ వీటితో చివరగా జరిగిన సిరీస్‌ల్లో INDనే పైచేయి(2-1) సాధించింది. లీగ్‌లో మిగిలిన 3 మ్యాచ్‌ల్లో గెలిస్తే నేరుగా సెమీస్‌కు వెళ్లే అవకాశముంది. లేదంటే కనీసం 2 గెలిచి, మెరుగైన NRR మెయింటెన్ చేస్తే క్వాలిఫై అవ్వొచ్చు.