News August 15, 2025

APP ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

image

TG: స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా రాష్ట్ర ప్రభుత్వం అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా 118 పోస్టులను భర్తీ చేయనుంది. వేతనాలు, అర్హతలు, ఎంపిక విధానానికి సంబంధించిన వివరాలు అధికారిక <>వెబ్‌సైట్‌లో<<>> అందుబాటులో ఉన్నట్లు చెప్పింది. రాత పరీక్ష‌లో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా నియామకాలు చేపడుతారు. 200 మార్కుల చొప్పున పేపర్​-1, పేపర్-2 పరీక్షలుంటాయి.

Similar News

News August 15, 2025

PHOTO GALLERY: రాజ్ భవన్‌లో ‘ఎట్ హోమ్’

image

AP: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్‌లో ‘ఎట్ హోమ్’ కార్యక్రమం జరిగింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు ఇచ్చిన తేనీటి విందులో సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్-అన్నా లెజినోవా దంపతులు పాల్గొన్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, సీఎస్ విజయానంద్, డీజీపీ హరీశ్ కుమార్, మంత్రులు లోకేశ్, కొల్లు రవీంద్ర, హైకోర్టు న్యాయమూర్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

News August 15, 2025

ట్రంప్, పుతిన్ మధ్య కనీసం 6-7గంటలు చర్చలు!

image

అమెరికా, రష్యా అధ్యక్షులు ట్రంప్, పుతిన్ కాసేపట్లో అలాస్కా వేదికగా భేటీ కానున్నారు. వీరి మధ్య కనీసం 6-7గంటల పాటు వివిధ అంశాలపై చర్చ జరగనున్నట్లు రష్యా అధికార వర్గాలు తెలిపాయి. ఈ భేటీ ఫలప్రదం అవుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ ఇరుదేశాధినేతల మధ్య ముఖ్యంగా ఉక్రెయిన్-రష్యా యుద్ధం గురించే చర్చ జరగనున్నట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది.

News August 15, 2025

GST.. ఏ వస్తువులు ఏ శ్లాబ్‌లోకి..!

image

<<17416480>>GST<<>>లో రెండే శ్లాబులు ఉంటాయని కేంద్రం ప్రతిపాదించింది. CNBC TV18 ప్రకారం ఏ వస్తువులు ఏ శ్లాబులోకి వస్తాయంటే..
*TVలు, ACలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు 28% నుంచి 18%
*ఆహారం, మెడిసిన్స్, విద్య, నిత్యావసర వస్తువులు 0 లేదా 5%
*వ్యవసాయ పనిముట్లు 12% నుంచి 5%
*ఇన్సూరెన్స్ 18% నుంచి 5% లేదా జీరో
>>SEP/OCTలో GST కౌన్సిల్ దీనిపై నిర్ణయం తీసుకోనుంది.