News July 15, 2024
44,288 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

దేశ వ్యాప్తంగా పోస్టాఫీసుల్లోని 44,228 బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ ఉద్యోగాల భర్తీకి ఇండియా పోస్ట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇవాళ్టి నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 6 నుంచి 8వ తేదీ వరకు దరఖాస్తుల్లో మార్పులు చేసుకోవచ్చు. టెన్త్ పాసైన 18 నుంచి 40 ఏళ్లలోపు వారు అర్హులు. ఏపీలో 1355, TGలో 981 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరిన్ని వివరాలకు ఇక్కడ <
Similar News
News December 1, 2025
నల్గొండ: సర్పంచ్ ఎన్నికలు.. పార్టీలకు మరో తలనొప్పి..!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో చాలా చోట్ల రెండు, మూడు మధిర గ్రామాలు ఓ మేజర్ గ్రామ పంచాయతీ కింద కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం మేజర్ గ్రామాల నేతలకు, మధిర గ్రామాల నేతలకు మధ్య తీవ్ర పోటీ నెలకొంది. తమ గ్రామంలో ఓట్లు ఎక్కువ ఉన్న కులం వారికే సర్పంచ్ రిజర్వేషన్ వచ్చిందని, అందుకే తమ గ్రామంలోని అభ్యర్థులకే ప్రధాన పార్టీలు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రధాన పార్టీలకు కొత్త తలనొప్పి వచ్చి పడింది.
News December 1, 2025
రేపు హైకోర్టుకు పరకామణి కేసు నివేదిక

AP: టీటీడీ పరకామణి కేసు విచారణ నేటితో పూర్తి కానుంది. రేపు సీఐడీ అధికారులు హైకోర్టుకు నివేదిక సమర్పించనున్నారు. హైకోర్టు ఆదేశాలతో అక్టోబర్ 27 నుంచి సీఐడీ.. టీటీడీ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డి సహా 35 మందిని విచారించింది. విచారణకు హాజరవుతూ అప్పటి AVSO సతీశ్ అనుమానాస్పదంగా మరణించారు. చెన్నై, బెంగళూరు, విశాఖలో నిందితుడు రవికుమార్ ఆస్తులను పరిశీలించింది.
News December 1, 2025
‘దిత్వా’ తుఫాన్.. ఈ జిల్లాలకు వర్ష సూచన

AP: నైరుతి బంగాళాఖాతంలో ‘దిత్వా’ తుఫాన్ ఈ మధ్యాహ్నంలోపు వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. దీని ప్రభావంతో ఇవాళ నెల్లూరు, తిరుపతిలో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కడప, కర్నూలు, అన్నమయ్య, చిత్తూరు, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.


