News August 1, 2024
4455 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

దేశంలోని 11 బ్యాంకుల్లో 4455 PO/మేనేజ్మెంట్ ట్రైనీస్ ఉద్యోగాల భర్తీకి IBPS నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 1 నుంచి 21 వరకు దరఖాస్తు, ఫీజు చెల్లింపులు చేయవచ్చు. అక్టోబర్లో ప్రిలిమ్స్ జరుగుతాయి. అదే నెల లేదంటే నవంబర్లో ఫలితాలు విడుదల చేస్తారు. నవంబర్లో మెయిన్స్ నిర్వహించి.. డిసెంబర్/జనవరిలో ఫలితాలు విడుదల చేస్తారు. జనవరి/ఫిబ్రవరిలో ఇంటర్వ్యూ ఉంటుంది. మరిన్ని వివరాలకు ఇక్కడ <
Similar News
News January 20, 2026
రోహిత్, కోహ్లీకి బీసీసీఐ షాక్ ఇవ్వనుందా?

భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విషయంలో BCCI కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వార్షిక కాంట్రాక్టుల్లో టైర్-2కు డిమోట్ చేయనుందని సమాచారం. 4 టైర్ రిటైనర్షిప్ సిస్టమ్ నుంచి A+ క్యాటగిరీని తొలగించాలని అగార్కర్ ఆధ్వర్యంలోని సెలక్షన్ కమిటీ బోర్డుకు సూచించినట్లు తెలిసిందని India Today పేర్కొంది. A+ ఆటగాళ్లకు ₹7 కోట్లు, A-₹5 కోట్లు, B-₹3 కోట్లు, C- ₹1 కోటిని BCCI చెల్లిస్తోంది.
News January 20, 2026
ఇది సిట్ విచారణ కాదు.. చిట్టి విచారణ: కేటీఆర్

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో చేస్తుంది సిట్ విచారణ కాదని చిట్టి విచారణ అని కేటీఆర్ విమర్శలు చేశారు. ఇదో లొట్ట పీసు కేసు అంటూ వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ నేతలను విచారణ, కమిషన్ల పేరుతో ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. తన బురదను అందరికీ అంటించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెడుతున్నారన్నారు. నైనీ బ్లాక్ రద్దు వెనక వాటాల పంచాయితీ ఉందని ఫైరయ్యారు.
News January 20, 2026
ALL TIME RECORD: ఒక్క రోజులో RTCకి రూ.27.68 కోట్ల ఆదాయం

AP: సంక్రాంతి పండగ వేళ APSRTC రికార్డు సృష్టించింది. సంస్థ చరిత్రలో ఒక్కరోజులో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించింది. జనవరి 19న రూ.27.68 కోట్ల రాబడిని సాధించింది. ఆ రోజు మొత్తం 50.60 లక్షల మందిని గమ్యాలకు చేర్చింది. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లిన వారికి తిరుగు ప్రయాణంలో ఇబ్బందులు లేకుండా గమ్యస్థానాలకు చేర్చింది. డ్రైవర్లు, కండక్టర్లు ఇతర సిబ్బందికి ఎండీ ద్వారకా తిరుమలరావు అభినందనలు తెలిపారు.


