News March 13, 2025
మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

AP: రాష్ట్రంలోని 164 మోడల్ స్కూళ్లలో ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 17 నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవచ్చని విద్యాశాఖ తెలిపింది మార్చి 18 నుంచి మే 22 లోగా దరఖాస్తులు సమర్పించాలని పేర్కొంది. టెన్త్లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్, రిజర్వేషన్ల ప్రతిపాదికన మే 26న సీట్లు కేటాయిస్తారు. 27న వెరిఫికేషన్ నిర్వహిస్తారు. జూన్లో తరగతులు ప్రారంభమవుతాయి. apms.ap.gov.in
Similar News
News March 13, 2025
పోతారు.. మొత్తం పోతారు: యూఎన్ చీఫ్ హెచ్చరిక

దేశాలు వాణిజ్య యుద్ధాల్లోకి దిగడం ఎవరికీ మంచిది కాదని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్ హెచ్చరించారు. సుంకాల పోరు అన్ని దేశాలనూ దెబ్బ కొడుతుందని పేర్కొన్నారు. ‘మనం నేటికాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బతుకుతున్నాం. అన్ని దేశాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. స్వేచ్ఛాయుత వాణిజ్యం అందరికీ ఉపయోగం. అదే వాణిజ్య యుద్ధంలోకి వెళ్తే విజేతలెవరూ ఉండరు’ అని స్పష్టం చేశారు.
News March 13, 2025
ప్రకృతి ఇచ్చిన రంగులతో హోలీ జరుపుకోండి

హోలీ సందర్భంగా వాడే కృత్రిమ రంగులతో<<15741783>> చర్మ<<>>సమస్యలతో పాటు కంటికి ప్రమాదం. కనుక ఇంటి వద్ద లభించే వస్తువులతోనే రంగులు తయారు చేయవచ్చు. పసుపులో కొంత శనగపిండి కలిపితే రంగుగా మారుతోంది. ఎర్ర మందారం బియ్యంపిండి, కుంకుమపువ్వు కలపాలి. ఆకులను ఎండబెట్టి గ్రైండర్ పడితే గ్రీన్ కలర్ రెడీ. గులాబీ రేకులను పొడిగా చేసుకొని రుబ్బితే సరిపోతుంది. వీటితో పాటు కంటికి అద్దాలను ధరిస్తే ఎటువంటి ప్రమాదం ఉండదు.
News March 13, 2025
వైకుంఠపురం డీపీఆర్ రూపొందిస్తున్నాం: మంత్రి

AP: వైకుంఠపురం బ్యారేజ్ పునర్నిర్మాణానికి డీపీఆర్ తయారు చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. 15లక్షల క్యూసెక్కుల వరద నీటిని తట్టుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు పూర్తికావాల్సి ఉండేదని, కానీ 2019లో వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టును రద్దు చేసిందన్నారు. రాష్ట్రంలో ఎన్నో సాగునీటి ప్రాజెక్టులను జగన్ ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపివేసిందని అసహనం వ్యక్తం చేశారు.