News October 6, 2025
25వేల పోస్టులకు త్వరలో నోటిఫికేషన్లు!

TG: ప్రభుత్వం ఏర్పడి ఈ DECతో రెండేళ్లు కానున్న నేపథ్యంలో మరిన్ని ఉద్యోగాల భర్తీకి INC సిద్ధమవుతోంది. 2 నెలల్లో 25వేల పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు సమాచారం. పోలీస్ శాఖలో 17వేల పోస్టులున్నట్లు DGP శివధర్ రెడ్డి ప్రకటించారు. వాటితో పాటు టీచర్, డిప్యూటీ DEO, డైట్, BEd కాలేజీల్లో లెక్చరర్లు, SERTలో ఖాళీలు నింపాలని TGPSC సన్నాహాలు చేస్తోంది. గ్రూప్-1,2,3,4 నోటిఫికేషన్లూ రిలీజ్ అయ్యే అవకాశముంది.
Similar News
News October 6, 2025
యాక్షన్ దిశగా ప్రభుత్వం.. రెడీ అంటున్న విజయ్

కరూర్ తొక్కిసలాటపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహంతో తమిళనాడు ప్రభుత్వం విజయ్‌పై చర్యలకు సిద్ధమవుతోంది. నిందితుడిగా కేసు పెట్టడం, దుర్ఘటనకు కారకుడిగా చేయడం సహా ఇతర అంశాలు పరిశీలిస్తోంది. అటు ఏ నిర్ణయం తీసుకున్నా ఎదుర్కొనేందుకు సిద్ధమని TVK నేతల భేటీలో విజయ్ పేర్కొన్నారు. ‘41 మంది చనిపోతే సుమోటో కేసుతో ఇద్దరు కిందిస్థాయి నేతల అరెస్టులేనా? విజయ్‌పై చర్యలు తీసుకోరా? అని ప్రభుత్వాన్ని HC గతవారం ప్రశ్నించింది.
News October 6, 2025
త్వరలో సింగరేణి స్థలాల్లో పెట్రోల్ బంకులు!

TG: తమ సంస్థకు చెందిన ఖాళీ స్థలాల్లో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయాలని సింగరేణి నిర్ణయించింది. ఇందుకోసం IOCL, HPCL, BPCL సంస్థలతో ఒప్పందం చేసుకుంది. ఖాళీ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా వాటిని లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. ఖమ్మం(D) మణుగూరు, కొత్తగూడెంలోని ఆదివారం సంత, మంచిర్యాల(D) మందమర్రి, బెల్లంపల్లి, పెద్దపల్లి(D) రామగుండం ఏరియాల పరిధిలో మొత్తం 7 బంకులు నిర్మించేందుకు ప్రతిపాదించింది.
News October 6, 2025
రుక్మిణీ వసంత్ పేరెంట్స్ గురించి తెలుసా?

‘కాంతార ఛాప్టర్-1’తో హీరోయిన్ రుక్మిణీ వసంత్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. ఆమె తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్ ఆర్మీ ఆఫీసర్. రుక్మిణీకి ఏడేళ్ల వయసు ఉన్నప్పుడే 2007లో పాక్ ఉగ్రవాదులతో ఎదురుకాల్పుల్లో మరణించారు. తల్లి సుభాషిణి భరతనాట్యం కళాకారిణి. భర్త మరణించాక తనలా సైన్యంలో భర్తలను కోల్పోయిన మహిళల కోసం ఫౌండేషన్ ఏర్పాటు చేసి సాయం చేస్తున్నారు. ప్రస్తుతం రుక్మిణీ NTR-నీల్ సినిమాలో నటిస్తున్నారు.