News October 6, 2025
NOV 12 లోగా బకాయి CMR పూర్తి చేయాలి: KMR కలెక్టర్

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సోమవారం IDOC మీటింగ్ హాల్‌లో రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఖరీఫ్ 2024-25 సీజన్‌కు సంబంధించి బకాయి ఉన్న CMR (కస్టమ్ మిల్లింగ్ రైస్)ను నవంబర్ 12 లోగా పూర్తి చేయాలని మిల్లర్లను కలెక్టర్ ఆదేశించారు. ప్రతి మిల్లును ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రోజువారీ విజిట్ చేయాలని సూచించారు. జిల్లా పౌర సరఫరాల అధికారి, FCI డిపో మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News October 6, 2025
అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సమీక్ష

ఆకాంక్షిత జిల్లా అభివృద్ధి కార్యక్రమాల అమలు స్థితిని సమీక్షించడానికి, కేంద్రప్రభారి అధికారి సోలామన్ అరోకియా రాజ్, అదనపు కార్యదర్శి, ఆర్థిక వ్యవహారాల శాఖ, సోమవారం జిల్లా పర్యటనకు వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన జిల్లా ప్రధాన కేంద్రాలు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, వ్యవసాయ, మహిళా, ఇతర అభివృద్ధి సంబంధిత కేంద్రాలను పరిశీలించి, కలెక్టరేట్లో జిల్లా అధికారులతో కలసి ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.
News October 6, 2025
సంగారెడ్డి: పది ప్రత్యేక తరగతుల్లో మార్పులు

పదో తరగతి ప్రత్యేక తరగతులు సాయంత్రం 4:15 నుంచి 5:15 గంటల వరకు మాత్రమే నిర్వహించాలని సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సూచించారు. సంగారెడ్డిలోని కార్యాలయంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు సోమవారం వినతి పత్రం సమర్పించారు. ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు సాయంత్రం మాత్రమే ప్రత్యేక తరగతులు నిర్వహించాలని డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.
News October 6, 2025
CJIపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా: ప్రధాని

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ BR <<17928232>>గవాయ్‌పై దాడిని<<>> తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘దీనిపై గవాయ్ గారితో మాట్లాడాను. మన సమాజంలో అలాంటి చర్యలకు తావు లేదు. ఆ ఘటన ప్రతి భారతీయుడికి కోపం తెప్పించింది. అలాంటి క్లిష్ట సమయంలో గవాయ్ శాంతంగా ఉండటాన్ని అభినందిస్తున్నా’ అని పేర్కొన్నారు.