News November 12, 2024

నవంబర్ 12: చరిత్రలో ఈ రోజు

image

* 1842: భౌతిక శాస్త్రంలో నోబెల్ గ్రహీత జాన్ స్ట్రట్ జననం.
* 1866: చైనా మొదటి అధ్యక్షుడు సన్ యాత్ సేన్ జననం.
* 1885: కొప్పరపు సోదర కవుల్లో ఒకరైన కొప్పరపు వేంకట సుబ్బరాయ జననం.
* 1896: విఖ్యాత పక్షిశాస్త్రవేత్త సలీం అలీ జననం.(ఫొటోలో)
* 1925: ప్రముఖ చలనచిత్ర నృత్యదర్శకుడు, పసుమర్తి కృష్ణమూర్తి జననం.
* 1946: భారత స్వాతంత్ర్య సమరయోధుడు పండిత మదన్ మోహన్ మాలవ్యా మరణం.

Similar News

News November 14, 2024

WI, IREతో IND జట్టు ఢీ.. షెడ్యూల్ విడుదల

image

వెస్టిండీస్, ఐర్లాండ్‌తో భారత మహిళల జట్టు స్వదేశంలో టీ20, వన్డే సిరీస్‌లు ఆడనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ రిలీజ్ చేసింది. డిసెంబర్ 15 నుంచి 27 వరకు వెస్టిండీస్‌తో 3టీ20లు నవీ ముంబైలో, 3 వన్డేలు బరోడాలో జరగనున్నాయి. 2025 జనవరి 10 నుంచి ఐర్లాండ్‌తో రాజ్‌కోట్ వేదికగా మూడు వన్డేల సిరీస్ నిర్వహించనున్నట్లు బీసీసీఐ తెలిపింది.

News November 14, 2024

Instagram డౌన్

image

ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. తాము లాగిన్ కాలేకపోతున్నామని, ఫొటోలు & వీడియోలు పోస్ట్ చేయలేకపోతున్నామని యూజర్లు ట్విటర్‌లో ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే, దీనిపై ఇన్‌స్టా యాజమాన్యం స్పందించలేదు. కొందరికి మాత్రమే ఇలాంటి సమస్య ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. మీకూ ఇలా జరిగిందా?

News November 14, 2024

వర్తు వర్మా.. వర్తు!

image

టీమ్ఇండియా యంగ్ క్రికెటర్, తెలుగు తేజం తిలక్ వర్మ సౌతాఫ్రికాతో మూడో టీ20లో అదరగొట్టారు. కేవలం 51 బంతుల్లో సెంచరీ చేసి ఔరా అనిపించారు. దీంతో క్రికెట్ అభిమానులు తిలక్‌ను అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. ‘వర్తు వర్మా.. వర్తు’ అంటూ ఆయన ప్రదర్శనను కొనియాడుతున్నారు. వర్మ సెంచరీతో టీమ్ఇండియా 219 రన్స్ చేయగలిగింది. ఈ కుర్రాడి బ్యాటింగ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.