News November 20, 2024

నవంబర్ 20: చరిత్రలో ఈ రోజు

image

1750: మైసూరు రాజు టిప్పు సుల్తాన్ జననం
1910: ప్రముఖ రచయిత లియో టాల్‌స్టాయ్ మరణం
1956: తెలుగు సినీ దర్శకుడు వంశీ జననం
1969: నటి శిల్పా శిరోద్కర్ జననం
1981: భాస్కర-2 ఉపగ్రహాన్ని ప్రయోగించిన ఇస్రో (ఫొటోలో)
1994: నటి ప్రియాంక మోహన్ జననం
* ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం

Similar News

News January 28, 2026

తిరుమల: ఆ రోజు RTC బస్సులకు నో ఎంట్రీ

image

తిరుమల శేషాచల అడవుల్లో ఫిబ్రవరి 1న శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి జరగనుంది. సంబంధిత ఏర్పాట్లపై తిరుమలలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్షించారు. భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాదం, తాగునీరు, వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. పాపవినాశనం వద్ద ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే దర్శనానికి అనుమతి ఉంటుంది. ప్రైవేట్ వాహనాలకు పర్మిషన్ లేదు. గోగర్భం డ్యాం నుంచి RTC బస్సులు ఏర్పాటు చేయనున్నారు.

News January 28, 2026

వర్కింగ్ ఉమెన్ ఇవి పాటించాల్సిందే..

image

ఉద్యోగం చేసే ప్రతి మహిళా ఉన్నత స్థానానికి ఎదగాలనే కోరుకుంటుంది. అయితే దీనివల్ల కుటుంబానికి కేటాయించే సమయం తగ్గుతుందని గుర్తించాలి. అన్ని పనులను వేగంగా, సంపూర్ణంగా చేయడం నేర్చుకోవాలి. ఆరోగ్యంగా ఉంటేనే అన్ని పనులూ చేయగలరు. కాబట్టి రోజూ కనీసం ఓ గంట వ్యాయామం, యోగాకి కేటాయించాలి. రేపు చేయాల్సిన పనుల జాబితాను ముందే రాసుకుంటే ఏం చేయాలనేదానిపై స్పష్టత వస్తుంది. ఉద్యోగినులకు ఇది చాలా అవసరం.

News January 28, 2026

హిమపాతం.. ధర్మశాల స్టేడియం ఇలా మారింది!

image

మంచు కురవడంతో హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల క్రికెట్ స్టేడియం వెండి కొండలా మెరిసిపోతోంది. చుట్టూ ఉన్న ధౌలాధర్ పర్వత శ్రేణులతో పాటు పరిసర ప్రాంతాలనూ మంచు దుప్పటి కప్పేసింది. సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉన్న ఈ స్టేడియం ప్రపంచంలోనే సుందరమైన మైదానాల్లో ఒకటిగా పేరుగాంచింది. SMలో వైరలవుతున్న అందమైన ఈ ఫొటోలను చూసి ప్రకృతి ప్రేమికులు ఫిదా అవుతున్నారు.