News November 27, 2024
నవంబర్ 27: చరిత్రలో ఈ రోజు

1888: లోక్సభ మొదటి స్పీకర్ జి.వి.మావలాంకర్ జననం
1940: మార్షల్ ఆర్ట్స్ యోధుడు బ్రూస్ లీ జననం
1953: హిందీ సంగీత దర్శకుడు బప్పీలహరి జననం
1975: నటి, మోడల్, రచయిత్రి సుచిత్రా కృష్ణమూర్తి జననం
1975: రేలంగి వెంకట్రామయ్య మరణం
1986: మాజీ క్రికెటర్ సురేశ్ రైనా జననం(ఫొటోలో)
2008: భారత మాజీ ప్రధాని విశ్వనాథ ప్రతాప్ సింగ్ మరణం
Similar News
News October 24, 2025
మృత్యు శకటాలుగా ప్రైవేట్ బస్సులు!

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు మృత్యు శకటాలుగా మారాయి. 2013 అక్టోబర్ 30న మహబూబ్నగర్ జిల్లా పాలెం సమీపంలో జబ్బార్ ట్రావెల్స్కు చెందిన బస్సులో మంటలు చెలరేగి 45 మంది ప్రయాణికులు చనిపోయారు. ఇవాళ మరో ప్రమాదంలో 20కి పైగా మరణించారు. అతివేగం, నిర్లక్ష్యం, సేఫ్టీకి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో అమాయకులు బలి అవుతున్నారు. ప్రమాదం జరిగిన కొన్ని రోజుల పాటు అధికారులు హడావిడి చేసినా ఆ తర్వాత తనిఖీలు చేయడం లేదు.
News October 24, 2025
ప్రమాద స్థలికి వెళ్లాలని కలెక్టర్, SPకి రేవంత్ ఆదేశం

చిన్నటేకూరు బస్సు ప్రమాదంపై తెలంగాణ CM రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎస్, డీజీపీతో ఈ తెల్లవారుజామున ఈ దుర్ఘటనపై మాట్లాడిన సీఎం, తక్షణమే హెల్ప్లైన్ ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సులో ఎక్కువ మంది HYDలో ఎక్కిన ప్యాసింజర్లు ఉన్నారు. దీంతో ఘటనాస్థలికి గద్వాల కలెక్టర్, ఎస్పీ వెళ్లి పరిస్థితి సమీక్షించి, ఏపీ ప్రభుత్వం నుంచి ప్రయాణికుల వివరాలు సేకరించాలన్నారు.
News October 24, 2025
తెలంగాణ న్యూస్ రౌండప్

*త్వరలో ‘సమగ్ర లైఫ్ సైన్సెస్’ పాలసీ.. 2030కల్లా 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చేలా రోడ్ మ్యాప్: మంత్రి శ్రీధర్ బాబు
*గిరిజన ఆశ్రమ స్కూల్స్, హాస్టల్స్ డైలీవేజ్ వర్కర్లకు తగ్గించిన జీతాలు చెల్లిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హామీ
*నాపై KTR చేసిన వ్యాఖ్యలపై పరువునష్టం దావా వేస్తా: మంత్రి జూపల్లి కృష్ణారావు
*రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ గుర్తించి, ఉత్పత్తి చేసేలా ప్లాంట్ ఏర్పాటుకు NFTDC సంస్థతో సింగరేణి ఒప్పందం


