News November 9, 2024

నవంబర్ 9: చరిత్రలో ఈరోజు

image

* ప్రపంచ నాణ్యతా దినోత్సవం
* 1877: కవి మహమ్మద్ ఇక్బాల్ జననం
* 1895: ఆధునిక ఆంధ్ర కవి దువ్వూరి రామిరెడ్డి జననం
* 1924: రచయిత, కథకుడు కాళీపట్నం రామారావు జననం
* 1978: సినీనటుడు రాజా పుట్టినరోజు
* 2009: నోబెల్ గ్రహీత హర‌గోబింద్ ఖురానా మరణం(ఫొటోలో)
* 2005: మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ మరణం

Similar News

News January 2, 2026

నవోదయానికి కేరళ రెడీ: మోదీ

image

కేరళ యువత, మహిళలు కొత్త ఉదయానికి సిద్ధంగా ఉన్నారని ప్రధాని మోదీ అన్నారు. తిరువనంతపురం మేయర్‌‌గా కొత్తగా ఎన్నికైన VV రాజేశ్, డిప్యూటీ మేయర్ ఆశా జి.నాథ్‌కు లేఖ రాశారు. ప్రజల ఛాయిస్‌గా ఎన్డీయే మారుతోందని అందులో పేర్కొన్నారు. కేరళలోని ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ఫిక్సింగ్ పాలిటిక్స్ ముగింపుకు వచ్చాయని పేర్కొన్నారు. ఆ కూటములు పేలవమైన పాలన సాగించాయని, వాటి హయంలో అవినీతి, రాజకీయ హింస పెరిగిపోయిందని ఆరోపించారు.

News January 2, 2026

ఇన్‌స్టాలో కోహ్లీ పోస్ట్.. 3 గంటల్లోనే 50L లైక్స్

image

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఫొటో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. న్యూ ఇయర్‌ సందర్భంగా ఆయన తన భార్య అనుష్కతో తీసుకున్న చిత్రం వైరలవుతోంది. 3 గంటల్లోనే 50 లక్షల లైక్స్ వచ్చాయి. ప్రస్తుతం లైక్స్ 81 లక్షలు దాటాయి. Dec 31న పోస్ట్ చేసిన మరో ఫొటోను గంటలోనే 40 లక్షల మంది ఇష్టపడటం గమనార్హం. కాగా టెస్టులు, T20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ ODIలు మాత్రమే ఆడుతుండటం తెలిసిందే.

News January 2, 2026

CM రేవంత్ వ్యూహాత్మక అడుగులు!

image

TG: అసెంబ్లీలో పాలమూరు ప్రాజెక్ట్ అంశం చర్చకు వస్తే KCR, BRSను నిలదీసేలా అధికారపక్షాన్ని CM రేవంత్ సన్నద్ధం చేశారు. విపక్షాన్ని చర్చకు ఆహ్వానిస్తూనే సభలో తాము ఎలా స్పందిస్తామనే క్లారిటీ ఇచ్చారు. KCRని ఏ అంశాలపై ప్రశ్నించదలిచారో <<18735385>>ప్రెస్‌మీట్<<>> పెట్టి మరీ వెల్లడించారు. సభలో సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. దీంతో ఇవన్నీ అసెంబ్లీ సమావేశాలపై రేవంత్ వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులేనా అన్న చర్చ సాగుతోంది.