News September 4, 2025

ఇక ఈ కార్లన్నింటిపై 40 శాతం GST

image

మిడ్ రేంజ్ కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి. 1500cc కెపాసిటీ, 4000mm పొడవు, 170mm గ్రౌండ్ క్లియరెన్స్.. వీటిల్లో ఏది మించినా 40% ట్యాక్స్ పడనుంది. స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్(SUV), మల్టీ యుటిలిటీ వెహికల్స్(MUV), మల్టీ పర్పస్ వెహికల్స్(MPV) క్రాస్ ఓవర్ యుటిలిటీ వెహికల్స్(XUV).. ఏ మోడలైనా పరిమితి దాటితే లగ్జరీ శ్లాబ్ పరిధిలోకి వస్తాయి. అటు ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రం 5% శ్లాబులోనే కొనసాగనున్నాయి.

Similar News

News September 5, 2025

రేపు నిమజ్జనం.. మెట్రో టైమింగ్స్ పొడిగింపు

image

రేపు HYDలోని ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం నేపథ్యంలో మెట్రో రైలు సమయాన్ని పొడిగించింది. తొలి ట్రైన్ రేపు ఉదయం 6 గంటలకు, చివరి ట్రైన్ అర్ధరాత్రి ఒంటి గంటకు అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి బయలుదేరుతాయని తెలిపింది. ప్రయాణికులు, భక్తులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కోరింది. ఎలాంటి ఇబ్బందులు పడకుండా వేడుకలు చేసుకోవాలని సూచించింది.

News September 5, 2025

అనిల్ అంబానీ రుణ ఖాతాలు మోసపూరితం: బ్యాంక్ ఆఫ్ బరోడా

image

రిలయన్స్ కమ్యూనికేషన్స్, దాని మాజీ డైరెక్టర్ అనిల్ అంబానీ రుణఖాతాలు మోసపూరితమని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించినట్టు Stock Exchangesకు ఆ సంస్థ సమాచారం ఇచ్చింది. అయితే BOB ఆరోపణలను ఖండిస్తున్నట్టు అనిల్ అధికార ప్రతినిధి తెలిపారు. సమస్య పరిష్కారం కోసం ఆయన న్యాయ సలహాలు తీసుకుంటారని వెల్లడించారు.

News September 5, 2025

జాతీయ అవార్డులు అందుకున్న ఉత్తమ తెలుగు టీచర్లు

image

ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఉత్తమ ఉపాధ్యాయులకు జాతీయ అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేశారు. దేశవ్యాప్తంగా 45 మంది టీచర్లు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఏపీ నుంచి తిరుమల శ్రీదేవి(HM-పండిట్ నెహ్రూ GVMC మున్సిపల్ హైస్కూల్), తెలంగాణ నుంచి పవిత్ర(పెన్‌పహడ్ స్కూల్) అవార్డు అందుకున్నారు. ఇక ప్రొఫెసర్ విభాగంలో ఏపీకి చెందిన ప్రొ.విజయలక్ష్మి, దేవానందకుమార్‌, TG నుంచి గోయల్, వినీత్‌ అవార్డులు స్వీకరించారు.