News September 11, 2024

ఇప్పుడు ఎవరైనా కశ్మీర్‌కు స్వేచ్ఛగా వెళ్లొచ్చు: అజిత్ పవార్

image

దేశంలో ఎవరైనా నేడు స్వేచ్ఛగా కశ్మీర్ వెళ్లి రావొచ్చని ఎన్సీపీ నేత అజిత్ పవార్ గుర్తుచేశారు. తాను కేంద్ర హోం మంత్రిగా ఉన్నప్పుడు శ్రీనగర్‌లోని లాల్‌చౌక్ వెళ్లేందుకు కూడా భయపడ్డానంటూ కాంగ్రెస్ నేత సుశీల్ కుమార్ షిండే చేసిన వ్యాఖ్యలపై పవార్ స్పందించారు. ‘బీజేపీ ప్రభుత్వం ఉగ్రవాదులను అణచివేసింది. లాల్‌చౌక్‌లో త్రివర్ణ పతాకం ఎగరడం అనేది ఒకనాడు కల. నేడు అక్కడ జెండా రెపరెపలాడుతోంది’ అని పేర్కొన్నారు.

Similar News

News November 23, 2025

సత్యసాయి సిద్ధాంతాలు ఇవే: చంద్రబాబు

image

AP: 102 సత్యసాయి స్కూళ్లలో 60వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని సీఎం చంద్రబాబు కొనియాడారు. ‘సత్యం, ధర్మం, ప్రేమ, శాంతి, అహింస సిద్ధాంతాలుగా సత్యసాయిబాబా నూతన అధ్యాయం ప్రారంభించారు. తన మహిమలతో అన్ని మతాలు ఒక్కటేనని భక్తులకు ప్రత్యక్షంగా నిరూపించారు. దేశవిదేశాల నుంచి దేశాధినేతలు వచ్చి సత్యసాయిబాబాను దర్శించుకున్నారు. ఆయన ప్రేమ సిద్ధాంతాన్ని మనమంతా అర్థం చేసుకోవాలి’ అని పుట్టపర్తిలో తెలిపారు.

News November 23, 2025

ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

అసోంలోని దులియాజన్ ఆయిల్ ఇండియా లిమిటెడ్‌ 3 ఇంజినీర్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 27న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 24 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.70వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.oil-india.com/

News November 23, 2025

మిరియాలతో ఎన్నో ప్రయోజనాలు

image

మిరియాలు ప్రతి వంటింట్లో కచ్చితంగా ఉంటాయి. వీటివల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటున్నారు నిపుణులు. వీటిలో మెగ్నీషియం, ఐరన్‌, పొటాషియం, సి, కె విటమిన్లు, ఫైబర్‌ అధికంగా ఉంటాయి. ఇవి బరువును తగ్గించడం, క్యాన్సర్‌ నివారణ, డయాబెటీస్ కంట్రోల్‌లో ఉంచడం, గుండె ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ పనితీరును పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. అయితే కడుపులో మంట ఉన్నవారు వీటిని మితంగా తీసుకోవాలి.