News March 21, 2025

ఇక రచ్చే.. రేపే IPL ప్రారంభం

image

ధనాధన్ క్రికెట్ సంబరానికి సర్వం సిద్ధమైంది. రేపు IPL 18వ సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో KKR, RCB పోటీ పడనున్నాయి. మండు వేసవిలో రెండు నెలలపాటు సిక్సర్లు, ఫోర్ల వర్షంలో తడిసి మురిసేందుకు అభిమానులు రెడీ అయ్యారు. వారిని ఏ మాత్రం నిరాశపర్చకుండా పైసా వసూల్ వినోదాన్ని అందించేందుకు ఆటగాళ్లు అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉన్నారు. స్టార్‌స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో మ్యాచ్‌లను వీక్షించవచ్చు.

Similar News

News March 28, 2025

అంచనాలే సన్‌రైజర్స్‌ కొంపముంచాయా?

image

IPLలో SRHపై ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కాదు. తరచూ 250కి పైగా స్కోర్లు నమోదు చేస్తుండటంతో SRH ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన ప్రతిసారీ 300 రన్స్ గురించే చర్చ నడుస్తోంది. ఆ రికార్డు సన్‌రైజర్స్‌కు మాత్రమే సాధ్యమన్న అంచనాలు ఆటగాళ్లపై ఒత్తిడి పెంచి ఉండొచ్చంటూ క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. తొలి మ్యాచ్‌లో స్వేచ్ఛగా ఆడిన అదే జట్టు, నిన్న అతి కష్టంగా 190 రన్స్‌ చేసిందని గుర్తుచేస్తున్నారు.

News March 28, 2025

హైకోర్టుల్లో 62 లక్షల పెండింగ్ కేసులు!

image

వివిధ నేరాల్లో నిందితులుగా ఉన్నవారిపై కోర్టులో విచారణ పూర్తిచేసేందుకు ఏళ్లు పడుతోంది. ఇందుకు కారణం న్యాయమూర్తుల కొరతేనని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదికలో వెల్లడైంది. 2024 చివరి నాటికి సుప్రీంకోర్టులో 82,000, వివిధ హైకోర్టులలో 62 లక్షలకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. 25 హైకోర్టుల్లో 1,122 మంది న్యాయమూర్తులను మంజూరు చేస్తే ప్రస్తుతం 750 మంది మాత్రమే ఉన్నట్లు పేర్కొంది.

News March 28, 2025

టెన్త్ స్టూడెంట్స్‌కు మధ్యాహ్న భోజనం

image

TG: టెన్త్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లో మధ్యాహ్న భోజనం అందించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ప్రభుత్వ పాఠశాలే ఎగ్జామ్ సెంటర్ అయి, అందులో గవర్నమెంట్ స్కూళ్ల విద్యార్థులు పరీక్షలు రాస్తుంటే వారికి భోజనం పెట్టి ఇంటికి పంపించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 21న ప్రారంభమైన పరీక్షలు ఏప్రిల్ 4 వరకు కొనసాగనున్నాయి.

error: Content is protected !!