News September 1, 2024

ఇప్పుడు EC కూడా BJP కోసం పనిచేస్తోంది: కాంగ్రెస్

image

ED, CBI మాత్రమే కాకుండా ఇప్పుడు ఎన్నికల సంఘం కూడా BJP కోసం పని చేయడం ప్రారంభించిందని కాంగ్రెస్ విమర్శించింది. ఒక రాజకీయ పార్టీ డిమాండ్‌పై ఎన్నికల సంఘం ఏకంగా అసెంబ్లీ ఎన్నికల తేదీనే మార్చడం దురదృష్టకరమని ఎంపీ మాణిక్యం ఠాగూర్ అన్నారు. హరియాణాలో BJPని ఓటమి భయం వెంటాడుతోందని విమర్శించారు. ఈ ఆలస్యం పార్టీ ఎన్నికల సన్నాహకాలపై ప్రభావం చూపబోదని AICC ఇన్‌ఛార్జ్ దీపక్ అన్నారు.

Similar News

News February 11, 2026

ఏప్రిల్ నుంచి విశాఖ మెట్రో రైలు భూసేకరణ?

image

AP: విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్ట్ భూసేకరణ ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మెట్రో మార్గంలో నష్టపోయే నివాస, వ్యాపార ఆస్తులను గుర్తించే సర్వే దాదాపుగా పూర్తయింది. ఈ రూట్‌కు 99.2 ఎకరాల భూమి అవసరం కాగా ఎక్కువభాగం ప్రభుత్వానికి(87 ఎకరాలు) చెందినదే ఉంది. రోడ్డుకు అనుసంధానంగా మెట్రో వెళ్లేలా DPR రూపొందించగా ఢిల్లీ, హైదరాబాద్ తరహా నిర్మాణ విధానం అనుసరించనున్నారు.

News February 11, 2026

‘మైసూర్ సోప్’ అంబాసిడర్‌గా తమన్నానే ఎందుకు?

image

తమన్నాను మైసూర్ శాండల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడంపై కర్ణాటకలో <<19102536>>దుమారం<<>> రేగిన విషయం తెలిసిందే. అయితే నార్త్, సౌత్‌లో పాపులర్ ఫ్యాక్టర్, ప్రస్తుతం ఆమె ఎలాంటి బ్యూటీ సబ్బులను ప్రమోట్ చేయకపోవడం, SM ఫాలోవర్లు, పాన్ ఇండియా అప్పియరెన్స్, స్క్రీన్ ప్రెసెన్స్ అంశాలు కారణాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంపిక కమిటీ చెబుతోంది. దీపిక, రష్మిక, కియారా, పూజా హెగ్డేను వెనక్కి నెట్టి తమన్నా ఈ ఆఫర్ కొట్టేశారు.

News February 11, 2026

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఎంతంటే?

image

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. ఓవరాల్‌గా 73.01శాతం పోలింగ్ నమోదైంది. కార్పొరేషన్లలో 66.05శాతం, మున్సిపాలిటీల్లో 75.88శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 5 గంటలకే పోలింగ్ ముగిసినా క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించి తాజాగా పూర్తి డేటాను వెల్లడించారు. ఎల్లుండి ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది.