News June 17, 2024
యుద్ధాన్ని ఆపేందుకు ఇదే సరైన సమయం: బైడెన్

హమాస్‌కు ఇజ్రాయెల్ చేసిన మూడు దశల కాల్పుల విరమణ ఒప్పందం గాజాలో యుద్ధాన్ని ముగించేందుకు ఉత్తమ మార్గమని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అభిప్రాయపడ్డారు. ముస్లింలకు ఈద్-అల్-అధా శుభాకాంక్షలు తెలిపారు. హమాస్, ఇజ్రాయెల్ మధ్య మారణకాండలో అమాయకులు బలవుతున్నారని పేర్కొన్నారు. వారి బాధ వర్ణాణాతీతం అన్నారు. పీడిత ముస్లిం వర్గాల హక్కుల కోసం అమెరికా ఎల్లప్పుడూ తమ గొంతు వినిపిస్తుందని చెప్పారు.
Similar News
News April 3, 2026
అమరావతిపై 2-3 రోజుల్లో గెజిట్ నోటిఫికేషన్

AP రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్ ఉభయ సభలు బిల్లును ఆమోదించాయి. పార్లమెంటు సెక్రటేరియట్ నుంచి హోం శాఖకు ఈ బిల్లు ప్రతులు చేరాయి. బిల్లును హోంశాఖ 2, 3 రోజుల్లో రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించనుంది. రాష్ట్రపతి సంతకం చేసిన వెంటనే చట్టంగా మారుతుంది. ఆపై కేంద్రం దానిపై గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వనుంది. అనంతరం అమరావతి ఆంధ్రప్రదేశ్‌కు చట్టబద్ధ రాజధాని కానుంది.
News April 3, 2026
శరీరంలో వేడిని ఎలా తగ్గించాలంటే?

కొందరి శరీరంలో ఎప్పుడూ వేడి ఎక్కువగా ఉంటుంది. ఇది తగ్గాలంటే కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. కొబ్బరినీళ్లు, కలబంద, పుదీనా జ్యూస్ వంటివి వేడి తగ్గడంలో సహకరిస్తాయి. మజ్జిగ, విటమిన్ సీ ఉండే ఆహారాలు తీసుకోవాలి. అలాగే కీరదోస, బీట్రూట్ జ్యూస్ తాగినా ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు తగినంత నీటిని తాగుతూ హైడ్రేటెడ్‌గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
News April 3, 2026
₹931 కోట్ల అమెరికా ఫైటర్ జెట్‌ను కూల్చేసిన ఇరాన్!

అమెరికాకు చెందిన మరో F-35 ఫైటర్ జెట్‌ను కూల్చేశామని ఇరాన్ ప్రకటించింది. సెంట్రల్ ఇరాన్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా దాడి చేసినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి పలు ఫొటోలను షేర్ చేసింది. దీనిపై ఇంకా US స్పందించలేదు. మార్చి 19న కూడా F-35 జెట్‌ను కూల్చేసినట్టు ఇరాన్ చెప్పింది. ఈ విమానం విలువ ₹931 కోట్ల పైనే అని సమాచారం. కువైట్‌లో చమురు శుద్ధి కర్మాగారం, సౌదీలోని US రాడార్‌ను ఇరాన్ ధ్వంసం చేసింది.


