News September 14, 2024
ఇక సెలవు.. కామ్రెడ్ ఏచూరి సీతారాం

CPM జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అంతిమయాత్ర ముగిసింది. ఢిల్లీలోని CPM కేంద్ర కార్యాలయం ఏకే గోపాలన్ భవన్ నుంచి ఎయిమ్స్ ఆసుపత్రి వరకు అంతిమయాత్ర సాగింది. అనంతరం ఆయన పార్థివదేహాన్ని ఆసుపత్రికి రీసెర్చ్ కోసం అప్పగించారు. ఇక సెలవంటూ దివికేగిన ఏచూరికి వివిధ దేశాల ప్రతినిధులు, అభిమానులు తుది వీడ్కోలు పలికారు. కడవరకు ప్రజాగొంతుకగా నిలిచిన కామ్రెడ్ను తలుచుకొని ‘లాల్ సలాం’ అంటూ నినదించారు.
Similar News
News January 17, 2026
కోమా నుంచి కోలుకున్నా.. మార్టిన్ ఎమోషనల్ పోస్ట్

కోమా నుంచి కోలుకున్న AUS మాజీ క్రికెటర్ డామియన్ మార్టిన్ Xలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘DEC 27న నా జీవితం తలకిందులైంది. ఒక్క క్షణంలో లైఫ్ ఎలా మారిపోతుందో తెలిసింది. 8 రోజులు <<18765261>>కోమాలో<<>> ఉన్నా. బతికేందుకు 50-50 ఛాన్స్ ఉండగా కోమా నుంచి బయటపడ్డా. కానీ నడవలేకపోయా. ఇప్పుడు కోలుకున్నా. బీచ్లో నిల్చోగలిగా. సపోర్ట్ చేసిన వారికి థాంక్యూ’ అంటూ ఓ ఫొటో పోస్ట్ చేశారు.
News January 17, 2026
వీరు చంద్రుడిని పూజిస్తే సమస్యలన్నీ దూరం

మనస్సుకు కారకుడు చంద్రుడు. మానసిక ప్రశాంతత లేనివారు, అనవసర భయాలతో ఆందోళన చెందేవారు చంద్రుడిని ఆరాధించాలి. చర్మ సంబంధిత వ్యాధులు, రక్తహీనత వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ పూజ మేలు చేస్తుంది. చంద్రుని అనుగ్రహం ఉంటే మనసు ప్రశాంతంగా మారుతుంది. పౌర్ణమి రోజున ధ్యానం చేయడం వల్ల మానసిక బలం పెరుగుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్లుగా, శారీరక మరియు మానసిక దృఢత్వం కోసం చంద్రుడిని ప్రార్థించడం ఎంతో అవసరం.
News January 17, 2026
డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

<


