News August 30, 2024
ఇప్పుడు రూ.కోటి పదేళ్ల తర్వాత రూ.35 లక్షలే!
ద్రవ్యోల్బణం చేసే నష్టం చాలా మందికి తెలీదు. ఆర్థిక సూత్రాల ప్రకారం కరెన్సీ విలువ ఏటా సగటున 6% తగ్గుతుంది. అంటే 2024లో రూపాయి 2025లో 94 పైసలే అవుతుంది. ఈ లెక్కన ఇప్పుడు కోటి 10, 20, 30 ఏళ్ల తర్వాత వరుసగా రూ.55L, రూ.31L, రూ.17Lకు పడిపోతుంది. ఆహార ధరలకు లైఫ్‌స్టైల్ ఇన్ఫ్లేషన్ (4%) జత చేస్తే తగ్గే విలువ భారీగా ఉంటుంది. Ex. కోటి విలువ పదేళ్ల తర్వాత రూ.35 లక్షలే. అందుకే నగదును ఐడిల్‌గా ఉంచొద్దు.
Similar News
News January 15, 2025
2025లో నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చే సినిమాలు ఇవే
ఈ ఏడాది తమ OTTలో వచ్చే కొన్ని సినిమాల పేర్లను నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.
☞ నాని ‘హిట్-3’, అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’
☞ విజయ్ దేవరకొండ- డైరెక్టర్ గౌతమ్ మూవీ (VD 12)
☞ నాగచైతన్య ‘తండేల్’, సూర్య ‘రెట్రో’
☞ రవితేజ ‘మాస్ జాతర’
☞ మ్యాడ్ సినిమా సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’
☞ సిద్ధూ జొన్నలగడ్డ ‘జాక్’
☞ నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’
☞ పవన్ కళ్యాణ్ ‘OG’
News January 15, 2025
ఏఐసీసీ కొత్త కార్యాలయం ప్రారంభం
ఢిల్లీలో AICC కొత్త కార్యాలయాన్ని సోనియా గాంధీ ప్రారంభించారు. ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ దిగ్గజాలతోపాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు. ఈ కొత్త భవనానికి ‘ఇందిరాగాంధీ భవన్’ అని పేరు పెట్టారు. 1978 నుంచి అక్బర్ రోడ్డులో కాంగ్రెస్ ఆఫీసు ఉండేది. తాజాగా 9A కోట్లా రోడ్డులో 6 అంతస్తుల్లో దీన్ని నిర్మించారు.
News January 15, 2025
హీరో పేరిట మోసం.. ₹7కోట్లు పోగొట్టుకున్న మహిళ!
తాను హాలీవుడ్ యాక్టర్ బ్రాడ్ పిట్‌నంటూ ఓ స్కామర్ ఫ్రెంచ్ మహిళ(53)ను మోసం చేశాడు. ఆన్లైన్ పరిచయం పెంచుకొని AI ఫొటోలు పంపి ఆమెను నమ్మించాడు. 2023 నుంచి రిలేషన్షిప్లో ఉన్నాడు. ఏంజెలినా జూలీతో డివోర్స్ వివాదం వల్ల క్యాన్సర్ చికిత్సకు సొంత డబ్బుల్ని వాడుకోలేకపోతున్నానని, మహిళ నుంచి ₹7cr రాబట్టాడు. తాను మోసపోయానని తెలుసుకున్న మహిళ డిప్రెషన్‌తో ఆస్పత్రి పాలయింది. అధికారులకు ఫిర్యాదు చేసింది.