News January 22, 2025
ఇక iOSలలోనూ ట్రూకాలర్ వాడొచ్చు!

ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉన్న ట్రూకాలర్ యాప్ ఇకపై ఐవోఎస్ ఫోన్లలోనూ పనిచేయనుంది. ఇకపై ఐఫోన్లలో అందుబాటులో ఉండేలా ట్రూకాలర్ అప్డేట్ తీసుకొచ్చింది. దీనికోసం యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఫోన్ సెట్టింగ్స్‌లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. Settings > Apps > Phone > Call Blocking & Identification ఎనేబుల్ చేయాలి. ఇది iOS 18.2 & ఆపైన వెర్షన్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
Similar News
News December 8, 2025
స్కూళ్లకు సెలవులపై ప్రకటన

TG: ఈ నెల 11న తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో స్కూళ్లకు రెండు రోజులు సెలవు ఇస్తూ డీఈవోలు ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్ జరిగే పాఠశాలలకు 10, 11న సెలవు ఉంటుందని పేర్కొన్నారు. 10న పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్ల దృష్ట్యా, 11న పోలింగ్ ఉండటంతో సెలవులు ఇస్తున్నట్లు వెల్లడించారు. కాగా తొలి విడతలో 4,236 గ్రామాల్లో పోలింగ్ జరగనుండగా ఉపాధ్యాయులు విధుల్లో పాల్గొననున్నారు.
News December 8, 2025
25 ఏళ్ల నాటి పాలసీల వల్లే TGకి ఆదాయం: CBN

AP: విభజనతో APకి వ్యవస్థీకృత సమస్యలు వచ్చాయని CBN చెప్పారు. వీటిని సరిచేస్తుండగా YCP వచ్చి విధ్వంసం చేసిందని విమర్శించారు. ‘2 తెలుగు స్టేట్స్ అభివృద్ధే నా ఆకాంక్ష. TGకి 25 ఏళ్లక్రితం నాటి పాలసీల వల్ల ఆదాయం వస్తోంది. YCP రుణాల్ని రీషెడ్యూల్ చేస్తున్నాం. తినే పంటలు పండిస్తేనే ఆదాయం. బిల్‌గేట్స్ ఫౌండేషన్‌తో అగ్రిటెక్‌ను అమల్లోకి తెస్తున్నాం. 9 జిల్లాలను ఉద్యాన క్లస్టర్‌గా చేస్తున్నాం’ అని తెలిపారు.
News December 8, 2025
ఏక పంట విధానం.. అన్నదాతకు నష్టం

ఒకే పంటను ఏటా ఒకే భూమిలో పండించే వ్యవసాయ పద్ధతినే ‘మోనోక్రాపింగ్'(ఏకరీతి పంట) అంటారు. తెలుగు రాష్ట్రాలలో ఇది ఎక్కువగా అమల్లో ఉంది. ఈ విధానం తొలుత లాభదాయకంగా కనిపించినా క్రమంగా పంట ఉత్పాదకత తగ్గుతుంది. భూ భౌతిక లక్షణాల క్షీణత, సేంద్రియ కర్బనం తగ్గడం, భూగర్భ జలాల కాలుష్యం, నేలల స్థిరత్వం దెబ్బతిని చీడపీడల బెడద పెరుగుతుంది. అందుకే పంట మార్పిడి విధానం అనుసరించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.


