News October 3, 2024
తిరుపతి లడ్డూ అపవిత్రం చేశారని మేం ఎక్కడా చెప్పలేదు: పవన్

AP: తిరుపతి వారాహి సభలో మాజీ సీఎం జగన్‌పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. ‘గత సీఎం తిరుపతి లడ్డూలు చుట్టారని, అపవిత్రం చేశారని మేం ఎక్కడా చెప్పలేదు. గుమ్మడికాయ దొంగ ఎవరంటే ఆయన భుజాలు తడుముకుంటున్నారు. పైగా మేమే రాజకీయం చేస్తున్నామంటున్నారు. జగన్ హయాంలో ఉన్న టీటీడీ బోర్డు వైఖరిపైనే మా ఆరోపణలు. తిరుమల ప్రసాదంలో నిబంధనల ఉల్లంఘనపైనే మా ఆవేదన’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News December 4, 2025
ASF: ఊపందుకున్న సోషల్ మీడియా ప్రచారం

ASF జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి సోషల్ మీడియాలో ఊపందుకుంది. అభ్యర్థులు అభివృద్ధి హామీలతో పోస్టులు షేర్ చేస్తూ, తమ మేనిఫెస్టోలతో నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. సమస్యల పరిష్కారం వంటి హామీలతో గ్రామాల్లో చర్చలు రగులుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచార వీడియోలు, పోస్టర్లను ఫేస్ బుక్, వాట్స్ అప్, ఇంస్టాగ్రామ్లో వైరల్ అవుతున్నాయి. ఎవరి వర్గానికి వారు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు.
News December 4, 2025
ఇంటర్వ్యూతో ICSILలో ఉద్యోగాలు

ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్(<
News December 4, 2025
పెప్లమ్ బ్లౌజ్‌ని ఇలా స్టైల్ చేసేయండి

సాధారణంగా పెప్లమ్ టాప్స్ జీన్స్‌పైకి సూట్ అవుతాయి. కానీ దీన్ని ఎత్నిక్ వేర్‌గా ట్రై చేస్తే మోడ్రన్ టచ్ ఇస్తుంది. పెప్లమ్ టాప్స్‌ను చీరలతో స్టైల్ చేసి ట్రెండీ లుక్ సొంతం చేసుకోవచ్చు. పార్టీల్లో, ఫంక్షన్లలో అందరి దృష్టిని ఆకర్షించాలంటే, జాకెట్ స్టైల్ పెప్లమ్ బ్లౌజ్‌తో చీరను మ్యాచ్ చేస్తే సరిపోతుంది. పెప్లమ్ బ్లౌజ్ వేసుకుంటే పల్లు లోపలికి తీసుకుంటారు. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.


