News February 28, 2026
NPDCL చరిత్రలోనే అత్యధిక విద్యుత్ వినియోగం

ఎన్పీడీసీఎల్ చరిత్రలోనే అత్యధిక గరిష్ఠ విద్యుత్ డిమాండ్ శనివారం నమోదయిందని సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. గత ఏడాది మార్చి 11న 5816 మెగావాట్లు గరిష్ఠ డిమాండ్ నమోదు కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అత్యధిక గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 6057 మెగావాట్లు నమోదు కావడం గమనార్హం అన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా అందించడానికి ముందస్తు ప్రణాళికతో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.
Similar News
News March 1, 2026
‘శాంతి కలుగుగాక’.. ఖమేనీ X అకౌంట్ నుంచి పోస్ట్!

ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ చనిపోయినట్లు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఆయన X అకౌంట్స్‌లో ఒకదానిలో పోస్ట్ చర్చనీయాంశమైంది. ‘అతనికి శాంతి కలుగుగాక’ అని అర్థం వచ్చే పర్షియన్ టెక్ట్స్‌తో పాటు ఓ యోధుడు ఖడ్గం పట్టిన ఇమేజ్ పోస్ట్ చేశారు. దీంతో ఇది ఖమేనీ మరణ వార్తను ఉద్దేశించి చేసిందేనని.. పరోక్షంగా కన్ఫామ్ చేసినట్టేనేనంటూ వార్తలు జోరందుకున్నాయి. అయితే ఇరాన్ ఇంకా దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
News March 1, 2026
ఖమేనీ చనిపోయారు: ట్రంప్

ఇరాన్ సుప్రీంలీడర్ అలీ ఖమేనీ చనిపోయినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఖమేనీని చరిత్రలోనే అత్యంత చెడ్డ వ్యక్తిగా పేర్కొన్నారు. ఈ చావుతో ఇరాన్ పౌరులతో పాటు అమెరికన్లు, బాధిత దేశాలకు న్యాయం జరిగిందన్నారు. తమ నిఘా నుంచి ఖమేనీ తప్పించుకోలేకపోయారని అన్నారు. ఇరాన్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అక్కడి పౌరులకు ఇది అతిపెద్ద అవకాశమన్న ట్రంప్.. దాడులు మరో వారం కొనసాగుతాయన్నారు.
News March 1, 2026
ఏలూరు: కార్మిక శాఖ పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఏలూరు జిల్లాలో 18 ఏళ్లు నిండిన కార్మికులు వివాహ కానుక, ప్రసూతి ప్రయోజన, సహజ మరణ ఉపశమన, అంత్యక్రియల వ్యయ సహాయ పథకాలకు దరఖాస్తు చేయాలని ఉప కార్మిక డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ శనివారం తెలిపారు. ఇప్పటికే ఈ పథకాలను నమోదు చేసుకున్న కార్మికులు వివరాలను (నవీకరణ) అప్‌డేట్ చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు జిల్లా లేబర్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.


