News September 22, 2024
NPS వాత్సల్య స్కీమ్: నెలకు ₹833తో ₹11 కోట్లు

NPS వాత్సల్య స్కీమ్‌తో పిల్లలకు 60 ఏళ్లు వచ్చేసరికి రూ.11.05 కోట్లు చేతికొస్తాయని అంచనా. Ex. నెలకు ₹833/ఏటా ₹10వేలు 18ఏళ్లు జమచేస్తే పెట్టుబడి ₹1.8 లక్షలవుతుంది. దీనిపై 10% రిటర్న్ వస్తే ₹5లక్షలు అందుతాయి. అదే 60 ఏళ్లకైతే పెట్టుబడి మొత్తం ₹6 లక్షలు అవుతుంది. దీనిపై రిటర్న్ 10% అయితే ₹2.75 కోట్లు, 11.59%తో ₹5.97 కోట్లు, 12.86%తో ₹11.05 కోట్లు అందుతాయి. జమ చేసే డబ్బును షేర్లలో ఇన్వెస్ట్ చేస్తారు.
Similar News
News December 5, 2025
ఇవాళే ‘అఖండ-2’ రిలీజ్?

నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ-2’ చిత్రాన్ని ఇవాళ రాత్రి ప్రీమియర్స్‌తో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. సమస్యలన్నీ కొలిక్కి రావడంతో ఏ క్షణమైనా మూవీ రిలీజ్‌పై ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీవర్గాలు తెలిపాయి. ఇవాళ సెకండ్ షోతో ప్రీమియర్స్, రేపు ప్రపంచవ్యాప్త విడుదలకు కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. లేకపోతే ఈనెల 19కి రిలీజ్ పోస్ట్‌పోన్ కానున్నట్లు సమాచారం.
News December 5, 2025
మాలధారణలో ఉన్నప్పుడు బంధువులు మరణిస్తే..?

అయ్యప్ప మాల వేసుకున్న భక్తులు రక్తసంబంధీకులు మరణిస్తే వెంటనే మాల విసర్జన చేయాలి. మరణించిన వ్యక్తి దగ్గరి బంధువు అయినందున గురుస్వామి వద్ద ఆ మాలను తీసివేయాలి. ఈ నియమం పాటించిన తర్వాత ఓ ఏడాది వరకు మాల ధరించకూడదు. అయితే దూరపు బంధువులు, మిత్రులు మరణిస్తే, మాలధారులకు ఎలాంటి దోషం ఉండదు. వారు మరణించినవారిని తలచుకొని, స్నానం చేసి స్వామిని ప్రార్థిస్తే సరిపోతుంది. <<-se>>#AyyappaMala<<>>
News December 5, 2025
వారికి కూడా చీరలు.. సీఎం కీలక ప్రకటన

TG: 18 ఏళ్లు పైబడిన మహిళలందరికీ ఇందిరమ్మ చీరలను అందించే బాధ్యత మంత్రులు సీతక్క, సురేఖకు అప్పగిస్తున్నట్లు CM రేవంత్ చెప్పారు. ‘ప్రస్తుతం 65L చీరలు పంపిణీ చేశాం. ఇంకా 35L చీరలు రావాలి. ఎన్నికల కోడ్‌తో ఆగిన చోట్ల, పట్టణ ప్రాంతాల మహిళలకూ MAR 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చీరలు ఇస్తాం’ అని ప్రకటించారు. డ్వాక్రా మహిళలు, వైట్ రేషన్ కార్డు ఉన్న మహిళలకు ప్రస్తుతం చీరలు ఇస్తున్న విషయం తెలిసిందే.


