News September 18, 2024

నేడు NPS వాత్సల్య పథకం ప్రారంభం.. ప్రయోజనాలివే

image

బాల, బాలికలకు ఆర్థిక భద్రతను కల్పించే NPS వాత్సల్య పథకం నేటి నుంచి అందుబాటులోకి రానుంది. పిల్లల పేరుతో పేరెంట్స్/సంరక్షకులు ఈ ఖాతా తీసుకోవచ్చు. వారికి 18 ఏళ్లు నిండాక ఇది NPS అకౌంట్‌గా మారుతుంది. ఏడాదికి రూ.1,000 నుంచి ఎంతైనా జమ చేసుకోవచ్చు. ఏటా వడ్డీ జమవుతుంది. ఇందులో పెట్టుబడితో సెక్షన్ 8CCD(1B) కింద రూ.50వేల పన్ను మినహాయింపు ఉంటుంది. 60 ఏళ్లు వచ్చాక NPS నిధిలో 60% డబ్బులు ఒకేసారి తీసుకోవచ్చు.

Similar News

News September 19, 2025

సూర్యపై ఫిర్యాదు చేయనున్న PCB?

image

పాకిస్థాన్‌పై గెలుపును భారత ఆర్మీకి అంకితం చేస్తున్నట్లు ప్రకటించిన <<17712252>>సూర్యకుమార్<<>> యాదవ్‌పై పాక్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆటల్లో సూర్య పొలిటికల్ కామెంట్స్ చేశారని, అది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని PCB భావిస్తున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే హ్యాండ్ షేక్ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు సూర్యపై ఫిర్యాదు చేస్తే ఆదివారం భారత్vsపాక్ మ్యాచ్ మరింత హీటెక్కనుంది.

News September 19, 2025

MANUUలో టీచింగ్ పోస్టులు

image

మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (<>MANUU<<>>) 13 టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈ నెల 29వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి పీజీ, పీహెచ్‌డీ, ఎంఈడీ/ఎంఏ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 65ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.500.

News September 19, 2025

జగనన్నా అసెంబ్లీకి వెళ్లు.. YCP ఫ్యాన్స్

image

AP: మాజీ సీఎం జగన్ <<17754283>>అసెంబ్లీకి<<>> వెళ్లి ప్రజాసమస్యలపై మాట్లాడాలని వైసీపీ ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. అసెంబ్లీలో అవమానాలు, విమర్శలు ఎదురైనా, మైక్ కట్ చేసినా సమస్యలపై గళం విప్పితే ప్రజల్లో సానుభూతి వస్తుందని చెబుతున్నారు. రాష్ట్రంలో యూరియా, ఉల్లి, టమాటా ధరలు పడిపోవడం సహా ఎన్నో సమస్యలు ఉన్నాయని, వీటిపై చర్చించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని సూచిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?