News August 11, 2024

NRIలు రాష్ట్రాభివృద్ధిలో పాలుపంచుకోవాలి: పెమ్మసాని

image

అమెరికాలో స్థిరపడ్డ ప్రవాస భారతీయులు ఏపీకి వచ్చి రాష్ట్రాభివృద్ధిలో పాలుపంచుకోవాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఫాంగ్ టెక్ ల్యాబ్ ఐటీ ట్రైనింగ్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. సరైన గైడెన్స్ లేక అమెరికా వెళ్లిన విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు.

Similar News

News November 29, 2024

చేబ్రోలు: బాలికను హత్య చేసిన నిందితుడు అరెస్ట్

image

చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామానికి చెందిన 9వ తరగతి చదువుతున్న శైలజ(13)ను జులై 15వ తేదీన నాగరాజు అనే వ్యక్తి హత్య చేసి పరారయ్యాడు. ఘటనపై పోలీసులు గత నాలుగు నెలలుగా నాగరాజు కోసం గాలింపు చేపట్టారు. ఈమేరకు గురువారం నిందితుడిని రాజమండ్రి ప్రాంతంలో అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

News November 29, 2024

నేటి నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు

image

నేటి నుంచి రానున్న 4 రోజుల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాల్లో భద్రంగా తెలిపారు. లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

News November 28, 2024

‘వైసీపీ త్వరలో అంతరించి పోతుంది’

image

వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబుపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. గుంటూరులో గురువారం కనపర్తి మీడియాతో మాట్లాడారు. పుష్ప అంటే మహిళ అని అంబటి భావిస్తున్నారని, రెండోసారి ఎమ్మెల్యేగా గెలవడానికి అంబటికి 30ఏళ్లు పట్టిందని అన్నారు. అంతరించిన ప్రాంతీయ పార్టీల జాబితాలోకి త్వరలో వైసీపీ చేయబోతుందని జోస్యం చెప్పారు.