News March 13, 2025

NRML: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

డిగ్రీ పాసైన BC అభ్యర్థులకు బ్యాంకింగ్&ఫైనాన్స్‌లో ఫ్రీ ట్రైనింగ్,ఉద్యోగం కల్పించడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ట్రైనింగ్ పూర్తైన తర్వాత ప్రైవేట్ బ్యాంకుల్లో ప్లేస్‌మెంట్ కల్పిస్తారన్నారు. అర్హులు ఈనెల 15 నుంచి www.tgbcstudycircle.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏజ్ లిమిట్-26లోపు ఉండాలి. దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్-ఏప్రిల్ 8గా పేర్కొన్నారు. SHARE IT

Similar News

News December 4, 2025

వైసీపీ వల్లే రాజధాని నిర్మాణం ఆలస్యం: నారాయణ

image

AP: వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో రాజధాని అమరావతి నిర్మాణం ఆలస్యమైందని మంత్రి నారాయణ విమర్శించారు. బకాయిలు చెల్లించి పనులు ప్రారంభించే నాటికి వర్షాలు ముంచెత్తాయని చెప్పారు. పల్నాడు జిల్లా అమరావతి మండలం యండ్రాయిలో రెండో విడత భూసమీకరణపై గ్రామస్థులతో సమావేశమయ్యారు. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ నిర్మిస్తామని పేర్కొన్నారు.

News December 4, 2025

పల్నాడు కోనసీమ మంచికల్లులో పోలేరమ్మ తిరుణాల వైభవం.!

image

పల్నాటి కోనసీమగా పిలవబడే రెంటచింతల మండలం మంచికల్లు గ్రామ దేవత పోలేరమ్మ తిరునాల మహోత్సవం కోర్ల పౌర్ణమి సందర్భంగా గురువారం రోజున పెద్ద ఎత్తున ప్రారంభమైంది. కొన్ని వందల సంవత్సరాలుగా డిసెంబర్‌లో వచ్చే పౌర్ణమి కొర్ల పౌర్ణమిగా పరిగణించి ఈ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. తిరుణాలలో మొదట శక్తిని నిలబెట్టి మరుసటి రోజు సాగనంపడం తరతరాల ఆనవాయితీగా వస్తుంది.

News December 4, 2025

ENCOUNTER: 19కి చేరిన మృతుల సంఖ్య

image

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో జరిగిన <<18460138>>ఎన్‌కౌంటర్‌లో<<>> మృతుల సంఖ్య పెరిగింది. ఇప్పటివరకు 19 మంది మావోలు చనిపోయినట్లు తెలుస్తోంది. మృతుల్లో PLGA-2 కమాండర్ వెల్లా మోడియం కూడా ఉన్నారు. భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. మరోవైపు ఎదురుకాల్పుల్లో నిన్న ముగ్గురు పోలీసులు మరణించిన విషయం తెలిసిందే.