News April 14, 2025

NRML: ఒకే ప్రాంతం.. 4 యాక్సిడెంట్లు

image

నర్సాపూర్ మండలంలోని తురాటీ, చాక్పల్లి గ్రామాల వద్ద ఉన్న హైవే 61 రహదారిపై నిర్మించిన స్పీడ్ బ్రేకర్లు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. గత 21 రోజుల్లో ఒకేచోట నాలుగు ప్రమాదాలు జరిగాయి. అందులో ఇద్దరు మరణించగా మిగతా మరో ఇద్దరు తీవ్ర గాయాలతో హాస్పటల్ పాలయ్యారు. అధికారులు స్పందించి స్పీడ్ బ్రేకర్లను తొలగించాలని గ్రామస్థులు, ప్రయాణికులు కోరుతున్నారు.

Similar News

News December 3, 2025

శ్రీకాంతాచారి చిరస్థాయిగా నిలిచిపోయాడు: కవిత

image

మలి దశ తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి చేసిన ఆత్మబలిదానం రాష్ట్ర ప్రజల్లో ఉద్యమ జ్వాలను మరింతగా రగిల్చిందని జాగృతి చీఫ్ కవిత అన్నారు. బుధవారం శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఆ అమరుడి త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఎల్బీనగర్‌లోని విగ్రహానికి ఆమె పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలు అర్పించిన యోధుడు శ్రీకాంతాచారి ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు.

News December 3, 2025

కోర్టుకెక్కిన పేరూరు గ్రామ ‘పంచాయితీ’..!

image

నాగార్జునసాగర్ నియోజకవర్గం అనుముల మండలం పేరూరులో ఎస్టీ మహిళ ఓటర్లు లేకున్నా గ్రామ సర్పంచ్, వార్డులు ఎస్టీ మహిళకి రిజర్వ్‌డ్ కావడంతో పంచాయతీ ఎన్నికలను గ్రామస్థులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాగా గ్రామంలో కేవలం ఒక్కరే ఎస్సీ అభ్యర్థి (పురుషుడు) ఉన్నారు. గ్రామ పంచాయతీలు 8 వార్డులు ఉండగా వాటిలో నాలుగు వార్డులు ఎస్టీకి రిజర్వ్‌డ్ చేశారు. ప్రస్తుతం ఈ పంచాయితీ కోర్టుకెక్కింది.

News December 3, 2025

హనుమాన్ చాలీసా భావం – 28

image

ఔర మనోరథ జో కోయీ లావై |
సోయి అమిత జీవన ఫల పావై ||
మనుషులు అనేక కోరికలతో దేవుళ్లను ప్రార్థిస్తారు. కానీ, హనుమంతుడిని సేవించేవారు మాత్రం జీవితంలో అపారమైన జీవన ఫలాలను పొందుతారు. ఆయన అనుగ్రహంతో అన్ని రకాల సుఖ సంతోషాలు, విజయాలు, అంతిమంగా మోక్షం కూడా లభిస్తాయి. హనుమంతుడిని వరం కోరడం అంటే, ఇక వేరే కోరిక అవసరం లేదు అని సందేశం. <<-se>>#HANUMANCHALISA<<>>