News April 14, 2025
NRML: ఒకే ప్రాంతం.. 4 యాక్సిడెంట్లు

నర్సాపూర్ మండలంలోని తురాటీ, చాక్పల్లి గ్రామాల వద్ద ఉన్న హైవే 61 రహదారిపై నిర్మించిన స్పీడ్ బ్రేకర్లు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. గత 21 రోజుల్లో ఒకేచోట నాలుగు ప్రమాదాలు జరిగాయి. అందులో ఇద్దరు మరణించగా మిగతా మరో ఇద్దరు తీవ్ర గాయాలతో హాస్పటల్ పాలయ్యారు. అధికారులు స్పందించి స్పీడ్ బ్రేకర్లను తొలగించాలని గ్రామస్థులు, ప్రయాణికులు కోరుతున్నారు.
Similar News
News July 11, 2025
NZB: కూలీల కొరత.. పొరుగు రాష్ట్రాల నుంచి బారులు

నిజామాబాద్ జిల్లాలో కూలీల కొరత వేధిస్తోంది. ఇక్కడి వారు ఉపాధి కొసం మలేషియా, కెనడాతో పాటు పలు దేశాలకు వలస వెళ్తున్నారు. దీంతో జిల్లాలో కూలీల కొరత ఏర్పడుతుంది. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వలస కార్మికులకు జిల్లా రైతులు ఆహ్వానం పలుకుతున్నారు. వరినాట్లు, హమాలీ పనులకు బిహార్, బెంగాల్, మహరాష్ట్ర నుంచి కూలీలు వస్తున్నారు. ఒక ఎకరం వరినాట్లు వేస్తే రూ. 4000 నుంచి రూ. 5000 వరకు కూలీ చెల్లిస్తున్నారు.
News July 11, 2025
నిజామాబాద్: వామ్మో.. డెంగ్యూ

నిజామాబాద్ జిల్లాలో డెంగ్యూ కేసులు బెంబెలెత్తిస్తున్నాయి. గత నెలలో 25 కేసులు నమోదవ్వగా ఈనెలలో 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు డెంగీ, సీజనల్ వ్యాధులు, విష జ్వరాలపై వైద్యాశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కేసులు నమోదవుతున్నాయి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటంతో పాటు కాచిచల్లార్చిన నీటిని తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.
News July 11, 2025
BHPL: రైతులందరూ ఫార్మర్ ఐడీని నమోదు చేసుకోవాలి

భూపాలపల్లి జిల్లాలోని రైతులందరూ ఫార్మర్ ఐడీని నమోదు చేసుకోవాలని వ్యవసాయాధికారులు కోరుతున్నారు. ఫార్మర్ ఐడీ ఉంటేనే కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెడుతున్న పథకాలకు అర్హులవుతారని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, రైతులు సంబంధిత ఏఈవోలను సంప్రదించి ఫార్మర్ ఐడీని నమోదు చేసుకోవాలని కోరారు.