News November 29, 2024

NRML: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల హర్షం: సామ రామ్మోహన్ రెడ్డి

image

ప్రజా ప్రభుత్వంపై రాళ్లు రువ్వించాలని సైకో రామ్ గ్యాంగ్‌ కుట్రలు చేస్తోందని TPCC మీడియా& కమ్యూనికేషన్స్ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు. దిలావర్‌పూర్‌లో అప్పటి దగాకోరు BRS ప్రభుత్వమే ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతించిందని, ప్రజలు వద్దని తెలపడంతో తమ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. దీంతో అక్కడి ప్రజలు CM రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేసి, హర్షం వ్యక్తం చేస్తూ BRSకు సమాధానం ఇచ్చారన్నారు.

Similar News

News January 5, 2026

ఆదిలాబాద్: నాగోబా జాతరకు పటిష్ట ఏర్పాట్లు: కలెక్టర్

image

ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా దేవాలయంలో ఈ నెల 18 నుంచి 25 వరకు నిర్వహించనున్న నాగోబా జాతరకు పటిష్ట ఏర్పాట్లు చేపడుతున్నట్లు కలెక్టర్ రాజార్షి షా తెలిపారు. సోమవారం నాగోబా దేవాలయాన్ని కలెక్టర్, పీవో యువరాజ్ మర్మాట్ సందర్శించారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు నాగోబా జాతరకు తరలివస్తారన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

News January 5, 2026

ఆదిలాబాద్: గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

image

ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. 2012 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ రాథోడ్ విలాస్(38) సోమవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఆయన, సోమవారం ఉదయం ఇచ్చోడలోని తన స్వగృహంలో ఉండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచారు.

News January 5, 2026

తెలంగాణ స్టేట్ ఛాంబర్ అఫ్ కామర్స్ అండ్ ట్రేడ్స్ ADB కమిటీ ఎన్నిక

image

తెలంగాణ స్టేట్ ఛాంబర్ అఫ్ కామర్స్ అండ్ ట్రేడ్స్ ఆదిలాబాద్ జిల్లా నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా శివప్రసాద్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా తోట భాస్కర్, కోశాధికారిగా జాబు రాజు లను నియమించినట్లు ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జగదీష్ అగర్వాల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపెళ్లి శివప్రసాద్ తెలిపారు. సంఘం బలోపేతంతో పాటు వ్యాపారస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారు పేర్కొన్నారు.