News January 20, 2025

NRML: కొడుకు మరణాన్ని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య

image

NRML జిల్లా <<15204489>>బాసర గోదావరి<<>> నదిలో దూకి శివరాం(62) మృతిచెందినట్లు ఎస్సై గణేశ్ తెలిపారు. NZB జిల్లా ఎడపల్లి మండలం జానకంపేటకు చెందిన శివరాం పెద్దకొడుకు 2ఏళ్ల కింద మరణించారు. మనస్తాపం చెందిన శివరాం ఇంటి వద్ద రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించగా కుటుంబీకులు కాపాడారు. సోమవారం బాసరకు వచ్చి గోదావరిలో దూకారు. పోలీసులు గాలించి మృతదేహాన్ని వెలికితీశారు. శివరాం చిన్నకొడుకు సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేశారు.

Similar News

News December 6, 2025

ADB: సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు వద్దు: ఎస్పీ

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో సున్నితమైన వాతావరణం నెలకొంటుందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సోషల్ మీడియాలో వర్గాలను రెచ్చగొట్టేలా పోస్టులు, వ్యాఖ్యలు చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించిన వారిపై పోలీసు చర్యలు ఉంటాయన్నారు.

News December 6, 2025

ADB: ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. ఆదిలాబాద్ జడ్పీ సమావేశ మందిరంలో మూడు విడతల ఎన్నికల సూక్ష్మ పరిశీలకులు (మైక్రో అబ్జర్వర్లు), జోనల్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన ఈ సూచనలు చేశారు. ప్రతి సూక్ష్మ పరిశీలకులకు ఒక గ్రామ పంచాయతీని కేటాయిస్తామని, ఆ పరిధిలోని అన్ని వార్డులను పరిశీలించాల్సి ఉంటుందని తెలిపారు.

News December 6, 2025

ఆదిలాబాద్‌: మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరగాలి: కలెక్టర్

image

ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం మహిళల్లో పెరగాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మహిళలపై హింసకు వ్యతిరేకంగా అంతర్జాతీయ ప్రచారోద్యమం నేపథ్యంలో, ఆదిలాబాద్‌లోని న్యూ అంబేద్కర్ భవన్‌లో సఖి కేంద్రం, జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. మహిళలపై హింస నిర్మూలనకు సమాజమంతా ముందుకు రావాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.