News March 16, 2025

NRML: గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు

image

2025-26 విద్యాసంవత్సరానికి జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్లో 6,7,8,9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 6వ తరగతి ప్రవేశానికి 31 ఆగస్టు 2025 నాటికి విద్యార్థులకు 12 ఏళ్లకు మించకూడదన్నారు. SC, ST విద్యార్థులకు రెండేళ్లు సడలింపు ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 31లోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News March 16, 2025

కర్నూలు: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు విద్యాశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రైవేట్ పాఠాశాలలకు చెందిన విద్యార్థులు తమ పాఠశాల యూనిఫామ్ వేసుకుని పరీక్షలకు హాజరు కాకూడదని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ ఆదివారం తెలిపారు. ఈ ఆదేశాలను అతిక్రమించి విద్యార్థులను యూనిఫామ్‌తో పరీక్షలకు పంపితే, ఆ పాఠశాలల యజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

News March 16, 2025

మెట్రోలో బెట్టింగ్ యాడ్స్ మాటేంటి సార్..!

image

HYD మెట్రోలో బెట్టింగ్ యాప్స్ యాడ్‌లు తీవ్ర వివాదాని దారితీశాయి. HML ఎండీ NVS రెడ్డికి బెట్టింగ్ యాప్స్‌లపై ఫిర్యాదులు చేసినా చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ గ్రేటర్ HYD ఎస్సీ సెల్ కన్వీనర్ తోటకూర శ్రీకాంత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మరి మెట్రోలో బెట్టింగ్ యాడ్స్ మాటేంటి సార్ అని అధికారులను ప్రశ్నించారు. వీటితో ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నాయని, యాప్స్‌ను నమ్మి మోసపోవద్దని అన్నారు.

News March 16, 2025

కోహ్లీ.. ఆ ఒక్క సెంచరీ చేస్తే

image

భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డుకు అడుగు దూరంలో ఉన్నారు. ఐపీఎల్‌లో మరో సెంచరీ చేస్తే టీ20 ఫార్మాట్‌లో 10 శతకాలు చేసిన తొలి భారత ప్లేయర్‌గా నిలవనున్నారు. ఆ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ(8) ఉన్నారు. కోహ్లీ IPLలోనే 8 సెంచరీలు, అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక సెంచరీ చేశారు. ఓవరాల్‌గా టీ20 ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ల జాబితాలో గేల్(22), బాబర్(11) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

error: Content is protected !!