News April 4, 2025
NRML: డిగ్రీ విద్యార్థులకు GOOD NEWS

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును KU అధికారులు పొడిగించిన విషయం తెలిసిందే. కాగా వీటితో పాటు 1, 3, 5 సెమిస్టర్ పరీక్షలు సైతం రాసేందుకు అవకాశం కల్పించినట్లు KU అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో 1, 3, 5 పరీక్ష ఫీజును ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈనెల 11 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News January 9, 2026
సంగారెడ్డి: ఉమ్మడి జిల్లాలో మహిళలదే పై చేయి

మున్సిపాలిటీ ఎన్నికల ముసాయిదా ఓటర్ జాబితా విడుదలైంది. దీని ప్రకారం ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని 19 మున్సిపాలిటీల్లో మొత్తం 5,43,103 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లు 2,73,219 మంది కాగా, పురుష ఓటర్లు 2,69,432 మంది ఉన్నారు. ఎన్నికలు జరగనున్న అన్ని మున్సిపాలిటీల్లోనూ పురుషుల కంటే మహిళా ఓటర్లు 3787 మంది ఎక్కువగా ఉన్నారు.
News January 9, 2026
మదనపల్లె: పురిటి బిడ్డను పారేసిన కసాయి తల్లి

మదనపల్లె పరిధిలోని బాలాజి నగర్లో అమానుష ఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పురిటి బిడ్డను తల్లి పారేసి వెళ్లిపోయింది. పసికందు కేకలు విన్న స్థానికులు కానిస్టేబుల్ మధుకర్కు సమాచారం ఇచ్చారు. పేగు కూడా ఊడని ఆ పసికందును ఎత్తుకుని చుట్టు పక్కల విచారించారు. బిడ్డను వదిలివెళ్లిన కసాయి తల్లి ఎవరన్నది తెలియరాలేదు. బిడ్డ చలికి విలపిస్తుంటే చూడలేక చలించిన ఓ అమ్మ మనసు ఆ బిడ్డను అక్కున చేర్చుకుంది.
News January 9, 2026
సమ్మె నోటీస్.. నేడు ఏం జరుగుతుందో?

AP: సంక్రాంతి వేళ అదును చూసుకుని ఆర్టీసీలోని అద్దె బస్సుల యజమానులు సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ నెల 12 నుంచి బస్సులు <<18803654>>నిలిపేస్తామని<<>> ప్రకటించారు. నిన్న మంత్రి రాంప్రసాద్తో జరిగిన చర్చలు విఫలం కావడంతో ఇవాళ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుతో భేటీ కానున్నారు. పండుగ సమయంలో దాదాపు 2,500 బస్సులు ఆగిపోతే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. దీంతో ఎలాగైనా సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది.


