News February 23, 2025
NRML: నేడు ఉమ్మడి గురుకుల ప్రవేశ పరీక్ష

ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకులాల్లో 2025-2026 విద్యాసంవత్సరానికి 5వ తరగతితో పాటు 6 నుంచి 9వ తరగతుల్లో ఖాళీల భర్తీకి ఆదివారం అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లాలో విద్యార్థుల కోసం అధికారులు పరీక్ష కేంద్రాలు సిద్ధం చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు.
Similar News
News November 27, 2025
HNK టౌన్‌హాల్‌కి శతాబ్దం.. శతవత్సరాల చారిత్రక సాక్ష్యం

వరంగల్ నగరంలో నిలిచిన హనుమకొండ టౌన్‌హాల్‌కు శతవత్సరం పూర్తైంది. 1924లో పునాదిరాయి వేసి ఏడో నిజాం చేతుల మీదుగా ప్రారంభమైన ఈ కట్టడం నేటికీ చారిత్రక ప్రతీకగా నిలుస్తోంది. ‘మహబూబ్ బాగ్’ పేరుతో 7 ఎకరాల్లో నిర్మించిన ఈ గార్డెన్‌కి అప్పట్లో రూ.2 లక్షలు మంజూరు చేశారు. ఒకప్పుడు చిన్న జూపార్క్‌గా ఉన్న ఇక్కడ.. నేరెళ్ల వేణుమాధవ్ ఆడిటోరియంతో సాంస్కృతిక కేంద్రంగా కొనసాగుతోంది.
News November 27, 2025
‘ఆసుపత్రులకు శాశ్వత రిజిస్ట్రేషన్ మంజూరు చేశాం’

జిల్లాలో ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందిచేందుకు ఆస్పత్రులపై నిరంతర పర్యవేక్షణ అవసరమని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. కలెక్టర్ ఛాంబర్లో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అమలు పురోగతిపై సమీక్షించారు. జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ వైద్యసంస్థల నమోదు, నిబంధనల అమలు, సేవల నాణ్యత, ప్రజారోగ్య పరిరక్షణ అంశాలపై విస్తృతంగా చర్చ జరిపి 46 ప్రైవేట్ ఆసుపత్రులకు శాశ్వత రిజిస్ట్రేషన్ మంజూరు చేశామన్నారు.
News November 27, 2025
రాష్ట్రంలో 60 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (<


