News January 24, 2025

NRML: మా భూములు మాకివ్వండి: పీరెల్స్ బాధిత రైతులు

image

గతంలో పీరెల్స్ సంస్థకు అమ్మిన భూములను తిరిగి ఇవ్వాలని దిలావర్పూర్, నర్సాపూర్ (జి), సారంగాపూర్ మండలాలకు చెందిన పలువురు రైతులు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌కు వినతిపత్రం అందజేశారు. గత 20 ఏళ్ల క్రితం పీరెల్స్ సంస్థ మాడెగాం, కదిలి, కుస్లీ, దర్యాపూర్, ప్యారమూరు, వైకుంఠాపూర్ తదితర గ్రామాల రైతుల నుంచి వేలాది ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. తిరిగి అభూమిని ఇప్పించాలని రైతులు కలెక్టర్‌ను కోరారు.

Similar News

News December 18, 2025

వైద్యం కోసం పేదలు ఆస్తులు అమ్ముకోవాలి: జగన్

image

AP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో పేదలు వైద్యం కోసం ఆస్తులు అమ్ముకోవలసి వస్తుందని YCP చీఫ్ జగన్ చెప్పారు. కోటి సంతకాలను గవర్నర్‌కు సమర్పించి CBN స్కామ్‌ను వివరించామన్నారు. ‘స్కూళ్లు, ఆసుపత్రులను ప్రభుత్వం నడపకపోతే ఆ సేవలు పేదలకు భరించరానివి అవుతాయి. ₹8వేల CRతో 17 కాలేజీలను భూములు సేకరించి కట్టాం. 7 కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. మీకు చేతకాకపోతే మేం వచ్చాక పూర్తిచేస్తాం’ అని అన్నారు.

News December 18, 2025

బండి సక్సెస్.. BJP@104

image

ఉమ్మడి KNR(D)లో జరిగిన GP ఎన్నికల్లో BJP అనూహ్యంగా 104 స్థానాల్లో గెలిచింది. గత GP ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమైన BJP.. బండి సంజయ్ ప్రత్యేక ప్రణాళిక, వ్యూహాత్మక ఎత్తుగడలతో పటిష్ఠ స్థితికి చేరుకుంది. పట్టణాలకే పరిమితమనుకున్న BJP ఇప్పుడు పల్లెల్లో పాగా వేసింది. ఉమ్మడి KNRలో ఒక్క BJP ఎమ్మెల్యే లేకున్నా మెరుగైన ఫలితాలు సాధించింది. క్షేత్రస్థాయిలో BJP బలపడుతుందని చెప్పడానికి ఈ ఫలితాలే ఉదాహరణ.

News December 18, 2025

ఈ నెల 21న జాతీయ లోక్ అదాలత్: ASF SP

image

ఈ నెల 21న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆసిఫాబాద్ జిల్లా SP నితికా పంత్ తెలిపారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న క్రిమినల్, సివిల్, ఎక్సెజ్, మోటారు వాహనాల కేసులను అధిక సంఖ్యలో రాజీ కుదుర్చుకొని క్లోజ్ చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు ఉపయోగించుకోవాలని ఆమె సూచించారు.