News April 12, 2025
NRML: మూడు రోజులే గడువు..APPLY NOW

రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని జడ్పీ సీఈఓ గోవింద్, మండల ఎంపీడీవో పుష్పలత సూచించారు. నర్సాపూర్(జి) మండలంలోని నందన్ గ్రామపంచాయతీలో పలువురు అధికారులు, గ్రామస్థులతో మాట్లాడారు. కులవృత్తులు చేసుకునే వారికి, నిరుద్యోగ యువతకు మేలు చేసే విధంగా ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేస్తుందని తెలిపారు. ఆసక్తి గలవారు ఏప్రిల్ 14 లోపు దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు.
Similar News
News November 20, 2025
Alert: రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు

AP: రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. ఈ నెల 22న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడొచ్చని APSDMA తెలిపింది. తర్వాత 48 గంటల్లో మరింత బలపడుతుందని పేర్కొంది. నేడు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని అంచనా వేసింది. రేపు కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఆస్కారం ఉందని తెలిపింది.
News November 20, 2025
‘1600’ సిరీస్తోనే కాల్స్.. ట్రాయ్ కీలక ఆదేశాలు

దేశంలో పెరిగిపోతున్న స్పామ్, ఫ్రాడ్ కాల్స్కు అడ్డుకట్ట వేసేందుకు ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా సంస్థలు తమ సర్వీసు, లావాదేవీల కాల్స్ కోసం 1600తో మొదలయ్యే నంబర్ సిరీస్ను ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకులు జనవరి 1 నాటికి, పెద్ద NBFCలు, పేమెంట్స్ బ్యాంకులు ఫిబ్రవరి 1 కల్లా, మిగతా NBFCలు, సహకార బ్యాంకులు, RRBలు మార్చి 1 లోపు ఈ సిరీస్కు మారాల్సి ఉంది.
News November 20, 2025
తిరుపతి: ఆ ఖాతాల్లో రూ.112.42 కోట్ల నగదు.!

తిరుపతి కలెక్టరేట్లో బుధవారం కలెక్టర్ డా.వెంకటేశ్వర్ JC మౌర్యతో కలిసి ‘మీడబ్బు–మీహక్కు’ పోస్టర్ ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా 3 నెలల పాటు క్లెయిమ్ చేయని బ్యాంకు డిపాజిట్లు, షేర్లు, బీమా పాలసీలు వంటి ఆర్థిక ఆస్తులను లబ్ధిదారులు తిరిగి పొందేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని కేంద్రం ప్రారంభించినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఇలాంటి 5,50,632 ఖాతాల్లో రూ.112.42 కోట్ల నిల్వలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.


