News April 12, 2025

NRML: మూడు రోజులే గడువు..APPLY NOW

image

రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని జడ్పీ సీఈఓ గోవింద్, మండల ఎంపీడీవో పుష్పలత సూచించారు. నర్సాపూర్(జి) మండలంలోని నందన్ గ్రామపంచాయతీలో పలువురు అధికారులు, గ్రామస్తులతో మాట్లాడారు. కులవృత్తులు చేసుకునే వారికి, నిరుద్యోగ యువతకు మేలు చేసే విధంగా ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేస్తుందని తెలిపారు. ఆసక్తి గలవారు ఏప్రిల్ 14 లోపు దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు.

Similar News

News April 13, 2026

HYD: భర్త డ్యూటీకి.. భార్య వీడియో కాల్స్

image

ఆడియో, వీడియో కాల్ యాప్స్ సంసారంలో నిప్పులు పోస్తున్నాయి. HYD సహా ఇతర ప్రాంతాల్లో చదువుకునే వారి నుంచి మహిళల వరకు యువకులకు వల వేస్తూ డబ్బు సంపాదనలో మునిగి, విలువలను మరుస్తున్నారు. మరికొందరేమో భర్త డ్యూటీకి వెళ్లాక అబ్బాయిలతో టైంపాస్ కోసం, జనరల్ టాకింగ్ అంటూ ఇలాంటి యాప్స్‌నకు ఆకర్షితులవుతున్నట్లు Gen-S సర్వే తెలిపింది. భార్య లేనప్పుడు భర్తలు సైతం వీటిలోకి టైమ్ పాస్ అంటూ వస్తున్నట్లు పేర్కొంది.

News April 13, 2026

రాకా: సైన్స్ ఫిక్షన్+ మైథాలజీ?

image

అట్లీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘రాకా’లో అల్లు అర్జున్ లుక్ మూవీపై హైప్‌ను పెంచింది. ఈ చిత్రంపై ఓ క్రేజీ బజ్ వైరలవుతోంది. ఇందులో సైన్స్ ఫిక్షన్‌తోపాటు మైథాలజీని కూడా టచ్ చేసినట్లు సమాచారం. తోడేళ్లకు సంబంధించి పురాణాల్లో ఉన్న ఆసక్తికర అంశాలను ఈ సినిమాలో మిక్స్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ ప్రాజెక్టుకు సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తుండగా దీపికా పదుకొణె, రష్మిక కీలక పాత్రలు పోషిస్తున్నట్లు టాక్.

News April 13, 2026

కర్నూలు రేంజ్‌లో 25 మంది సీఐల బదిలీ

image

కర్నూలు రేంజ్ పరిధిలో భారీగా పోలీసు అధికారుల స్థానచలనం జరిగింది. పరిపాలన కారణాలతో 25 మంది సీఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కర్నూలు, నంద్యాల, అనంతపురం, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాలలో ఈ పోస్టింగ్‌లు ఇచ్చారు. పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డు సిఫార్సుల మేరకు కొందరిని వీఆర్‌కు పంపారు. బదిలీ అయిన అధికారులు వెంటనే స్పందించి బాధ్యతలు స్వీకరించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.