News April 12, 2025
NRML: రాజీవ్ యువ వికాసానికి అప్లికేషన్లకు నెట్‌వర్క్ గండం

రాజీవ్ యువశక్తి ధరఖాస్తుల స్వీకరణకు నెట్‌వర్క్ గండం శాపంగా మారింది. గత గురువారం మధ్యాహ్నం 3 గంటలనుండి నెట్‌వర్క్ పని చేయటం లేదని, స్లోగా పనిచేయటంతో అప్లికేషన్ అప్‌లోడ్ కావటం లేదని లక్ష్మణచంద మండల మీ సేవా నిర్వాహకులు శుక్రవారం వాపోయారు. ఈ సమస్య వలన తహశీల్దారు కార్యలయంలో కూడా సర్టిఫికెట్ జారీ కావటంలేదని ఆశావాహులు ఆవేదన వ్యక్తం చేశారు. గడువును మళ్లీ పొడిగించాలని కోరుతున్నారు.
Similar News
News April 17, 2026
WGL: గంజాయి మత్తులో హమాలీపై దాడి

వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ సమీపంలో గంజాయి మత్తులో ఉన్న వ్యక్తులు హంగామా సృష్టించారు. మార్కెట్‌లో పని చేస్తున్న హమాలీ సూరయ్యపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో బాధితుడిని వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందగా దర్యాప్తు కొనసాగుతోంది.
News April 17, 2026
HYD: కాగితాల్లో 501.. నేల మీద 185..! (2)

చెరువుల బదిలీలో భారీ స్కామ్ జరిగిందా? GO 120 (2010) ప్రకారం 501 చెరువులను గుర్తించి, అందులో 399 మున్సిపల్ శాఖకు అప్పగించారు. కానీ పదేళ్లలోనే ఈ సంఖ్య 185కి ఎలా పడిపోయింది? హిమాయత్‌సాగర్ పరిధిలో 40 శాతం నీటి విస్తీర్ణం మాయమై, కాంక్రీట్ కోటలు వెలిశాయి. హుడా మాస్టర్ ప్లాన్ లెక్కలకూ, ఇప్పటి పరిస్థితికీ పొంతన లేదు. ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న <<19672164>>చెరువులు క్షేత్రస్థాయిలో<<>> కనిపించడం లేదు.