News February 16, 2025
NRML: రాష్ట్రాలు దాటొచ్చిన ఎడారి ఓడ

రాజస్థాన్ రాష్ట్రం నుంచి ఓ కుటుంబం తమ బతుకుదెరువు కోసం ఒంటెలను తెలంగాణ నిర్మల్ జిల్లా భైంసా నుంచి బాసరకు నాలుగు ఒంటెలను తీసుకొని వచ్చారు. అటుగా వెళుతున్న ప్రయాణికులు కొంతమంది ఒంటెలను చూసి ఎంత బాగున్నాయంటూ స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. ఎక్కడ నుంచి వస్తున్నారని వారిని కొందరు పలకరించగా రాజస్థాన్ నుంచి పొట్టకూటి కోసం, ఒంటెల మేత కోసం ఇక్కడికి వచ్చినట్లు ఒంటెల కాపర్లు తెలిపారు.
Similar News
News November 25, 2025
మంచి జరగబోతోంది: ట్రంప్

రష్యా-ఉక్రెయిన్ పీస్ టాక్స్లో ముందడుగు పడినట్లుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హింట్ ఇచ్చారు. ‘శాంతి చర్చల విషయంలో పెద్ద పురోగతి సాధించడం సాధ్యమేనా? మీరు చూసే దాకా దీన్ని నమ్మకండి. కానీ ఏదో ఒక మంచి జరగబోతోంది’ అని ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. కాగా యూఎస్ శాంతి ప్రతిపాదనను మెరుగుపరచాలని అంగీకరించినట్లు జెనీవా చర్చల తర్వాత అమెరికా, ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు.
News November 25, 2025
జిల్లాలో మొబైల్ కనెక్టివిటీ పెంపు: కలెక్టర్

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రతి గ్రామానికి మెరుగైన మొబైల్ సేవలు అందించేందుకు కొత్త టవర్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ దినేశ్ కుమార్ సోమవారం అధికారులను ఆదేశించారు. టవర్ల ఏర్పాటుకు అనువైన స్థలాలను తక్షణమే గుర్తించి, భూ సమస్యలను పరిష్కరించాలని ఆయన సూచించారు. కనెక్టివిటీ పెంపుకు అవసరమైతే అటవీ భూమి వినియోగం అంశాన్ని కూడా పరిశీలించాలని తెలిపారు.
News November 25, 2025
UAEలో సెటిల్ అవ్వాలని ప్లాన్లు.. ఎందుకిలా?

భారతీయులతో పాటు ఇతర దేశస్థులూ యూఏఈలో సెటిల్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ లేకపోవడం, మెరుగైన మౌలిక వసతులు, పబ్లిక్ సర్వీస్, సేఫ్టీ అని నిపుణులు చెబుతున్నారు. అక్కడి ప్రభుత్వం ఆయిల్ ఎగుమతులు, కార్పొరేట్ ట్యాక్స్, హోటళ్లు, వీసా, లైసెన్స్ ఫీజులు, టోల్ ట్యాక్స్ ద్వారా ఆదాయం తెచ్చుకుంటుంది. దీంతో పెద్దపెద్ద <<18378539>>వ్యాపారవేత్తలకు<<>> దుబాయ్ డెస్టినేషన్గా మారింది.


